DAILY G.K. BITS IN TELUGU JANUARY 3rd

DAILY G.K. BITS IN TELUGU JANUARY 3rd

1) భారత దేశంలో సివిల్ సర్వీసెస్ ను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : కారన్ వాలీస్

2) భారతదేశంలో మొట్టమొదటిసారి అడుగుపెట్టిన ఐరోపవారు ఏ దేశం వారు.?
జ : పోర్చుగీస్ (1498)

3) భారతదేశ చరిత్రలో ఎవరు యుగాన్ని కావ్య యుగమని, స్వర్ణ యుగమని పిలుస్తారు.?
జ : గుప్తల యుగం

4) సుప్రీం కోర్టు యొక్క న్యాయ సమీక్ష అధికారాన్ని భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది.?
జ : అమెరికా

5) ఆఫ్రికా ఖండాన్ని, ఆసియా ఖండాన్ని కలిపే భూభాగం పేరు ఏమిటి.?
జ : సినాయ్ ద్వీపకల్పం

6) దక్షిణ భారతదేశంలోనూ, పశ్చిమ కనుమల్లోనూ ఎత్తైన శిఖరము ఏది.?
జ : అనైముడి (2,695 మీ.)

7) ప్రపంచంలో విస్తీర్ణంలో అతిపెద్ద సరస్సు ఏది.?
జ : కాస్పియన్ సరస్సు

8) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : బెంగళూరు

9) కేంద్ర రాష్ట్ర సంబంధాలను పై 1983లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఏసిన కమిషన్ పేరు ఏమిటి.?
జ : సర్కారియా కమీషన్

10) జపాన్ దేశపు పార్లమెంట్ పేరు ఏమిటి.?
జ : డైట్

11) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ – 5

12) అంతరిక్షంలో అత్యధిక దూరాలను ఉదాహరణకు భూమి నుంచి నక్షత్రాలకు మధ్య గల దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏమిటి.?
జ : కాంతి సంవత్సరం

13) ఒక తీగలో ప్రవహిస్తున్న విద్యుత్తును కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు ఏమిటి.?
జ : అమ్మీటర్

14) కిన్వ ప్రక్రియలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏమిటి.?
జ : ఈస్ట్

15) ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన విటమిన్ ఏది.?
జ : రైబోప్లావిన్ (B2)

16) మూత్రపిండాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : నెఫ్రాలజీ

17) ప్రకరణ 248 ప్రకారం కేంద్ర, రాష్ట్ర పరిధిలో లేని అంశాలపై శాసనం చేసే అధికారం ఎవరికి ఉంటుంది.?
జ: పార్లమెంట్ కు

18) స్థానిక సుపరిపాలన సంస్థల పితామహునిగా ఎవరిని పిలుస్తారు.?
జ : లార్డ్ రిప్పన్ (1882 లోవస్థానిక స్వపరిపాలన చట్టం)

19) ఆంధ్ర మహిళ సభను ఏర్పాటు చేసినది ఎవరు.?
జ : దుర్గాబాయ్ దేశ్‌ముఖ్

20) ఆవర్తన పట్టికలో అర్ధలోహాలు ఏ బ్లాక్ లో ఉంటాయి.?
జ : P – బ్లాక్