DAILY GK BITS IN TELUGU 27th MAY

DAILY GK BITS IN TELUGU 27th MAY

1) భారతదేశంలో తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు పనిచేశారు.?
జ : గుల్జారి లాల్ నంద

2) అంతర్జాతీయ ఒప్పందాలు, సందులు న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయా.?
జ : రావు

3) ప్రముఖ పార్శి సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు ఎవరు.?
జ : దాదాభాయ్ నౌరోజీ

4) 1940 తొలి భాగంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు?
జ : మొహమ్మద్ అలీ జిన్నా

5) నిజాం కార్యకలాపాలను తెలియజేయటానికి ఎవరు హైదరాబాదులో “భాగ్యనగర్” రేడియో ప్రారంభించారు.?
జ : పాగా పుల్లారెడ్డి

6) జీవో నెంబర్ 610 ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.?
జ : 1985

7) గిరిగ్లాని కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 2001

8) ఆరు సూత్రాల పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1973

9) 1925 ఫిబ్రవరిలో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం.?
జ : మధిర

10) 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెన్సి పై దాడి చేసింది ఎవరు?
జ : తుర్రేబాజ్ ఖాన్

11) 2009 అనంతరం తెలంగాణ ఉద్యమానికి దోహదపడిన సాంస్కృతిక కళారూపం ఏది.?
జ : ధూం – ధాం

12) తెలంగాణలో కలప బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం.?
జ : నిర్మల్

13) రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అనే తెలుగు సినిమా పాట రాసిన కవి ఎవరు.?
జ : డాక్టర్ సి. నారాయణరెడ్డి

14) చిన్నపిల్లల అక్రమ రవాణాను బాల కార్మిక వ్యవస్థను నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : ముస్కాన్

15) అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 15