DAILY G.K. BITS IN TELUGU – MAY 11

1) 1960 నాటి బ్రిటిష్ ఇండియాలో ముస్లిం లీగ్ ను ఎక్కడ స్థాపించారు.?
జ : ఢాకా

2) బార్డోలి సత్యాగ్రహాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ సంవత్సరంలో నిర్వహించారు.?
జ : 1928

3) 1919లో జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగినప్పుడు భారత గవర్నర్ జనరల్
ఎవరు.?
జ : లార్డ్ చెమ్స్ ఫోర్డ్

4) నాఫ్తలిన్ మరియు డ్రై ఐస్ లు దేనికి ఉదాహరణలు.?
జ : ఉత్పతనము

5) ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు ఎవరు.?
జ : డూప్లెక్స్

6) ఏప్రిల్ 21వ తేదీని సివిల్ సర్వీసెస్ డే గా నిర్వహిస్తారు. ఆరోజు ప్రత్యేకత ఏమిటి?
జ : సివిల్ సర్వీసుల మొదటి బ్యాచ్ ను ఉద్దేశించి సర్దార్ పటేల్ ప్రసంగించిన రోజు

7) భానుడు ఏ రాజు ఆస్థానంలోని కవి.?
జ : హర్షుడు

8) భారతీయ వీణ మరియు ఇరానియన్ తంబురా లను మేలవించి తయారుచేసిన సంగీత వాయిద్యం ఏది?
జ : సితార్

9) భారత రైల్వే ల కార్పోటీకరణ కు మొదటగా సిఫార్సు చేసిన కమిటీ ఏది .?
జ : రాకేష్, మోహన్ కమిటీ

10) మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో సాధించిన వృద్ధిరేటు ఎంత.?
జ : 3.6%

11) బొగ్గు మండించినప్పుడు వచ్చే పొగలు ఉండే వాసన లేని వాయువు ఏది .?
జ : కార్బన్ మోనాక్సైడ్

12) వజ్రములు వేటి యొక్క శుద్ధ స్పటికములు.?
జ : శుద్ధ కార్బన్

13) ఎండోస్కోప్ తో జీర్ణాశయ లోపలి భాగాలు పరీక్షిస్తారు. ఎండోస్కోప్ లోని ఫైబర్స్ ఎలాంటివి.?
జ : ఆప్టికల్ ఫైబర్స్

14) కాంతి వేగంతో పోల్చినప్పుడు రేడియో తరంగాల వేగము.?
జ : సమానము

15) సెమీ కండక్టర్ ను వేడి చేసినప్పుడు దాని యొక్క విద్యుత్ నిరోధకత.?
జ : తగ్గుతుంది