DAILY G.K. BITS IN TELUGU JANUARY 7th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 7th

1) ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా వయోజనులకు ఓటు హక్కు కల్పించే కనీస వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.?
జ : 61వ రాజ్యాంగ సవరణ

2) సహజ రబ్బరు తయారీకి ఉపయోగించే లేటెస్ట్ పదార్థం ఏ చెట్టు నుండి వస్తుంది.?
జ : హివియో బ్రెజిలెన్సిస్

3) ప్రముఖ టైర్ల తయారీ సంస్థ MRF యొక్క పూర్తి నామము ఏమిటి.?
జ : మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ

4) కాంతి వేగం ఎంత.?
జ :. 3×10⁸ మీటర్/ సెకన్
3×10¹⁰ సెం.మీ./సెకన్

5) సమాచార రంగంలో ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్ ఏ భౌతిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.?
జ : సంపూర్ణాంతర పరావర్తనం

6) “పృధ్వీరాజ్ రాసో” అనే కావ్యాన్ని రచించినది ఎవరు.?
జ : చాంద్ బర్ధాయి

7) సైనికదినోత్సవం(ఆర్మీ డే)ను ఎప్పుడు జరుపుకుంటారు .?
జ : జనవరి 15

8) భారతదేశ మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం 1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు. దాని పేరు ఏమిటి?
జ : ఆర్యభట్ట

9) 1953లో భాషా ప్రయోక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను పరిశీలనకు నియమించిన కమిటీ పేరు ఏమిటి?
జ: ఫజల్ అలీ కమిషన్

10) రామన్ మెగాసేసి అవార్డును ఏ దేశ ప్రభుత్వం ఇస్తుంది.?
జ : ఫిలిప్పీన్స్

11) జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగువారు ఎవరు.?
జ : విశ్వనాథ సత్యనారాయణ సి.నారాయణరెడ్డి రావూరి భరద్వాజ

12) ద్విదల బీజ కలుపు మొక్కల నివారణ కోసం ఉపయోగించే మందు ఏది.?
జ : 2,4- DNP

13) రక్తం గడ్డకట్టకుండా బ్లడ్ బ్యాంకులలో ఉపయోగించే కృత్రిమ రసాయనము ఏమిటి.?
జ : హెపారిన్

14) త్రిబుల్ యాన్టిజన్ అని ఏ వ్యాక్సిన్ ను అంటారు.? జ : డి పి టి (DPT)

15) వృక్ష సంబంధిత ఆహార ఉత్పత్తులలో లభించని విటమిన్ ఏది?
జ : B12

16) శరీర సమతా స్థితికి దోహబ్ దోహదపడే భాగం ఏది?
జ : అనుమస్తిస్కం (చిన్న మెదడు)

17) పార్కిన్ సన్ వ్యాధి దేనితో సంబంధం కలిగి ఉంటుంది.?
జ : మెదడు

18) మొక్కలలోని పత్రాలలో అని హరిత రేణువులో ఉండే లోహం ఏది.?
జ : మెగ్నీషియం

19) అడవుల పెంపకం గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు?
జ : సిల్వి కల్చర్

20) భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది.?
జ : శుక్రుడు (వీనస్)

21) భూమికి సూర్యుడు దగ్గరగా వచ్చే స్థితిని మరియు దూరంగా ఉండే స్థితిని ఏమని పిలుస్తారు.?
జ : దగ్గరగా-పరిహేళి (జనవరి – 3)
దూరంగా- అపహేళి(జూలై- 04)

22) ధరల స్థాయి నిరంతరం పెరుగుదలను ఏమని పిలుస్తారు.?
జ : ద్రవ్యోల్బణం

23) పన్నుల సంస్కరణలపై 2002లో నియమించిన కమిటీ పేరు ఏమిటి.?
జ : విజయ్ కేల్కర్ కమిటీ

24) ప్రపంచంలో అతి పొడవైన కాలువ ఏది? ఎర్ర మధ్యధరా సముద్రాలను కలుపుతుంది.?
జ: సూయజ్ (169 కీ.మీ.)

25) ప్రస్తుతం దేశంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని.?
జ : 8

Comments are closed.