DAILY G.K. BITS IN TELUGU JANUARY 21st
1) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత.?
జ : 988 : 1000
2) హైదరాబాద్ రాష్ట్రంలో ఇత్తేహద్ – ఉల్ – ముస్లిమీన్ సంస్థ ఆవిర్భవించిన సంవత్సరం ఏమిటి.?
జ : 1927
3) “మన నిజాం రాజు జన్మజన్మల బూజు” అని నినదించినది ఎవరు.?
జ : దాశరథి కృష్ణామాచార్యులు
4) హైదరాబాద్ నగరాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏ సంవత్సరంలో నిర్మించాడు.?
జ : 1591
5) హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాష నిలయం ఏ సంవత్సరంలో నెలకొల్పారు.?
జ : 1901
6) హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది.?
జ : 1938
7) లోక్సభకు తొలి మహిళా స్పీకర్గా ఎవరు పనిచేశారు.?
జ : మీరా కుమార్
8) రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు.?
జ : 6 సంవత్సరాలు
9) నీటిలో కిరోసిన్ చల్లడం ద్వారా దోమలు, కీటకాలను చంపే ప్రక్రియ ఏ నీటి భౌతిక ధర్మం మీద ఆధారపడి ఉంటుంది.?
జ : నీటి తలతన్యత
10) ఎడారిలో ఒయాసిస్సులు ఏ భౌతిక ధర్మం ఆధారంగా ఏర్పడతాయి.?
జ : కేశనాళికీయత
11) మాంసాహారుల్లో అవశేషా అవయువంగాను… శాకాహారుల్లో ఉపయోగపడే అవయంగా ఉండే అవయం ఏది?
జ : ఉండుకము (ఎపెండిక్స్)
12) శాఖాహార జీవులలో ఉండుకము ఏ ఆహార పదార్థాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది.?
జ : సెల్యూలోజ్
13) హ మానవునిలో ఏ గ్రంధి అదృశ్యం అవడం వలన ముసలితనం అనేది కలుగుతుంది.?
జ : థైమస్
14) అను రియాక్టర్ లలో న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి ఉపయోగపడే రసాయనం ఏమిటి.?
జ : భార జలం (D₂O)
15) దేశంలో అత్యున్నత న్యాయాధికారి గా పిలవబడే అటార్నీ జనరల్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది.?
జ : 76
16) ప్రపంచంలో అతిపెద్ద మరియు అతి లోతైన మహాసముద్రం ఏది.?
జ : పసిఫిక్ మహా సముద్రం
17) భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి చెందిన నృత్యం.?
జ : తమిళనాడు
18) ప్రపంచంలో అతి పొడవైన నైలునది ఏ ఖండంలో ఉంది.?
జ: ఆఫ్రికా ఖండం
19) హిమాలయ పర్వత పాదాల ప్రాంతంలో విసనకర్ర ఆకారంలో ఏర్పడిన సచిద్ర మండలాలను ఏమంటారు.?
జ : భాబర్
20) వాన పాములను ఉపయోగించి ఎరువుల తయారీ చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : వర్మీ కల్చర్
Comments are closed.