1) నిజాం కాలేజ్ పూర్వనామం ఏమిటి.?
జ : హైదరాబాద్ కాలేజ్
2) సాంప్రదాయ బిద్రి హస్తకళల్లో ఉపయోగించే వస్తువులు ఏవి.?
జ : నలుపు రంగును అమర్చిన జింకు, రాగి, వెండి రేకుల మిశ్రమం
3) హైదరాబాదుకు ఏజెంట్ జనరల్ ను నియమించడానికి దారి తీసిన పరిణామం ఏది?
జ : యధాతధ ఒప్పందం
4) ఏ చరిత్రకారులు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించారు.?
జ : అబుల్ ఫజల్ & ఫెరిస్టా
5) 1933 పర్మానా ప్రకారం ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీస నివాస అర్హత ఎన్ని సంవత్సరాలు.?
జ : 15
6) రజాకర్ అని ప్రైవేట్ సైన్యం ఏ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పడింది.?
జ : మజ్లీస్ ఇత్తేహదూల్ ముస్లిమీన్
7) 1952 ముల్కీ ఉద్యమం మొదట ప్రారంభమైన జిల్లా.?
జ : వరంగల్
8) రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రతిపాదించే బిల్లును ఎవరి పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి.?
జ : రాష్ట్రపతి
9) దళితులను ఆది హిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఏది.?
జ : జగన్ మిత్రమండలి
10) పెద్దమనుషుల ఒప్పందం జరిగిన ప్రాంతం ఏది?
జ : న్యూఢిల్లీ
11) ‘జీవన యానం’ ఎవరి రచన.?
జ : దాశరధి రంగాచార్య
12) ‘ఏడుపాయలు’ ఎవరి రచన.?
జ : నందిని సిధారెడ్డి
13) ‘ముంగిలి’ ఎవరి రచన.?
జ : నారాయణరెడ్డి
14) నిజాం కాన్వాయ్ పై బాంబు విసిరింది ఎవరు.?
జ : నారాయణరావు పవార్
15) కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిణి శివతాండవం నృత్య రూపాన్ని పునరుద్ధరించి వ్యాప్తి చేసింది ఎవరు.?
జ : శ్రీ రంగాచార్యులు