DAILY G.K. BITS IN TELUGU JANUARY 16th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 16th

1) పంజాబ్ లోని స్వర్ణ దేవాలయాన్ని నిర్మించినది ఎవరు.?
జ : గురు రామదాసు

2) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన ఏకైక ప్రభుత్వ పథకం ఏది?
జ : స్వచ్ఛభారత్

3) ‘పేరిణి నృత్యం’ ఏ రాష్ట్రానికి చెందినది.?
జ : తెలంగాణ

4) వాహన బ్యాటరీలలో ఉండే విషపూరితమైన పదార్థం ఏది?
జ : లెడ్ (సీసం)

5) 92 ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న సహజ అతి భార మూలకం ఏది.?
జ : యూరేనియం

6) నిప్పాన్ ఏ దేశంలో ఒక పాత పేరు.?
జ : జపాన్

7) పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు.?
జ : లోక్‌సభ స్పీకర్

8) భారతదేశంలో అత్యధికంగా కాఫీని, పట్టును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

9) నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి – 28 (రామన్ ఎఫెక్ట్ కనుగోన్న రోజు)

10) గుండె నుండి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని తీసుకుపోయేవి ఏవి.?
జ : పుపుస దమని

11) కాకతీయ రుద్ర దేవుడు “నీతి సారం” అనే గ్రంధాన్ని ఏ భాషలో రచించాడు.?
జ : సంస్కృతం

12) పాక్ జలసంధి ఏ రెండు దేశాల మధ్య ఉంది.?
జ : భారత్ – శ్రీలంక

13) విశ్వం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : కాస్మోలాజీ

14) అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : వియన్నా

15) ఎడారులు లేని ఖండం ఏది.?
జ : యూరప్

16) మానవునిలో తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత.?
జ : 13 నుంచి 20 రోజులు

17) భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఎవరు?
జ : ఖాన్ అబ్దుల్లా గఫర్ ఖాన్

18) భూమధ్య రేఖ ప్రాంతంలో సంభవించే వర్షపాతం పేరు ఏమిటి?
జ : సంవహన వర్షపాతం

19) చీమలు కుట్టినప్పుడు విడుదల చేసే రసాయనము ఏమిటి.?
జ : ఫార్మిక్ ఆమ్లము

20) అధికంగా చొచ్చుకుపోయే సామర్థ్యం గల కిరణాలు ఏవి?
జ : గామా కిరణాలు