DAILY G.K. BITS IN TELUGU JUNE 1st

1) జనాభా లెక్కల నుండి మూడవ జెండర్ ను గణించడం ఎప్పటి నుంచి జరిగింది.?
జ : 2011 జనాభా లెక్కలు

2) అంగవైకల్యం గల వ్యక్తులకు సమాన అవకాశాలు, హక్కులను కల్పించాలని లక్ష్యంతో 2016 లో చేసిన చట్టం పేరేమిటి.?
జ : రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ బిల్లు 2016

3) వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షురాలుగా కాకా కాలేల్కర్ నియామకం ఎప్పుడు జరిగింది.?
జ : 1953

4) తెలంగాణ (పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా) 1/ 70 చట్టం దేన్ని సూచిస్తుంది.?
జ : గిరిజనుల భూములు గిరిజనేతరులకు బదలాయించకుండా నివారించడం

5) నోట్ల రద్దు సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు.?
జ : ఉర్జిత్ పటేల్

6) “పార్లమెంటు సభ్యుని స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం” (PM LADS) ఏ ప్రధానమంత్రి ప్రారంభించారు.?
జ : పీవీ నరసింహారావు

7) భారత రాజ్యాంగానికి అర్ధ వివరణ (వ్యాఖ్యానం) తెలిపే అంతిమ అధికారం ఏ వ్యవస్థకు ఉంది.?
జ : సుప్రీంకోర్టు

8)నిజాం రాష్ట్ర రైల్వే, రోడ్డు రవాణా శాఖ మరియు సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారి బస్సుల నెంబర్ ప్లేట్ మీద ఉండే జెడ్ అక్షరం ఎవరికి సంబంధించినది.?
జ: జహ్రా బేగం

9) హైదరాబాదులో హుస్సేన్ సాగర్ దగ్గర ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ప్రాంతంలో ఇంతకు మునుపు ఉన్నది ఏది?
జ : హుస్సేన్ సాగర్ థర్మల్ విద్యుత్ కేంద్రం

10) ముల్కీ నిబంధనలకు రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో కల్పించింది.?
జ : 1972

11) భారతీయ ముస్లిం లీగ్ ప్రచురించిన వార్తాపత్రిక పేరు.?
జ : స్టార్ ఆఫ్ ఇండియా

12) తొలి తెలుగు శాసనం వేయించిన రాజులు ఎవరు.?
జ : రేనాటి చోళులు

13) భారత రాష్ట్రపతి గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ వివరిస్తాయి.?
జ :ఆర్టికల్ 52 నుండి 62 వరకు

14) రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏది.?
జ : నైష్పత్తిఠ ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ విధానం ద్వారా రహస్య ఓటింగ్

15) లీలావతి గ్రంథ రచయిత ఎవరు.?
జ : నేమి చంద్రుడు