DAILY G.K. BITS IN TELUGU MAY 6th
1) వర్షాకాలంలో రోడ్డుపై నూనె పొరలు రంగులలో కనిపించుటను వివరించే దృగ్విషయం ఏది.?
జ : వ్యతికరణం
2) పెరుగులో ఉండే ఆమ్లము ఏమిటి.?
జ : లాక్టిక్ ఆమ్లము
3) ఏ పద్ధతిని భూస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టింది.?
జ : శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి
4) ఏ తరహా వ్యవసాయ కమతాలు భారతదేశంలో అధికంగా ఉన్నాయి.?
జ : పరిమిత కమతాలు
5) పంట సాగుకు ఉపయోగపడే సాధారణ భూమి యొక్క పీహెచ్ విలువ ఎంత.?
జ : 6 లేదా 7
6) తిరోగమన నైరుతి రుతుపవనాల ప్రభావానికి లోను కాని రాష్ట్రం ఏది?
జ : ఒడిశా
7) గ్రీన్ గోల్డ్ అని దేనిని అంటారు.?
జ : టీ
8) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్థాపించడం వెనక గల ఉద్దేశం ఏమిటి?
జ : మేదో పరమైన హక్కులను రక్షించడం
9) జాతీయ ఉద్యానవన కృషి మిషన్ ఎప్పుడు మొదలైంది.?
జ : 2005
10) భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతిలో గణిస్తారు.?
జ : ఉత్పత్తి ఆదాయాల మదింపు పద్ధతి
11) ఆర్థిక సంఘం యొక్క ప్రధాన విధి ఏమిటి.?
జ : కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ
12) లక్డావాల కమిటీ ఏ అంశం మీద వేయబడింది.?
జ : పేదరికం అంచనా
13) సాపేక్ష పేదరికాన్ని కొలవడానికి ఉపయోగించే పద్ధతి ఏది?
జ : గిణి గుణకము మరియు లారెంజ్ కర్వ్
14) హర్షవర్ధనుడు తన రాజధానిని ఎక్కడికి మార్చాడు.?
జ : తానేశ్వర నుంచి కనూజ్
15) నీతి చంద్రిక రచయిత ఎవరు.?
జ : పరవస్తు చిన్నయ్యసూరి