Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU MARCH 8th

DAILY G.K. BITS IN TELUGU MARCH 8th

DAILY G.K. BITS IN TELUGU MARCH 8th

1) నాథులా మార్గం గల రాష్ట్రం ఏది?
జ : సిక్కిం

2) తెలంగాణ రాష్ట్ర వర్షపాతం లో నైరుతి రుతుపవనాల ద్వారా లభించే వర్షపాత శాతం సుమారుగా.?
జ : ఎంత 80%

3) సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్యుని యొక్క ఏ భాగం సులభంగా కనిపిస్తుంది.?
జ : కరోనా

4) భారత పార్లమెంట్ వీటిని కలిగి ఉంటుంది.?
జ : లోక్ సభ, రాజ్యసభ, మరియు రాష్ట్రపతి

5) శ్రీరామ నవమి సందర్భంగా ప్రముఖంగా ప్రదర్శించబడే జానపద కళారూపం ఏది?
జ : చిరుతల భజన

6) కాకతీయుల పాలనలో ఏ విదేశీ యాత్రికుడు మోటుపల్లిని సందర్శించాడు.?
జ : మార్కోపోలో

7) తెలంగాణలో నిజాంసాగర్ డ్యాం ఏ నదిపై నిర్మించబడింది.?
జ : మంజీరా

8) వైద్య పరీక్షలో ఉపయోగించే రేడియో ఐసోటోపులను ఏమని పిలుస్తారు.?
జ : ట్రేసర్స్

9) తెలంగాణలో దక్కన్ సిమెంట్ కర్మాగారం ఎక్కడ గలదు.?
జ : హుజూర్ నగర్

10) మంచినీటి పర్యావరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమని అంటారు.?
జ : లిమ్నాలజీ

11) ఏ కులస్తులు సేవాలాల్ ను పూజిస్తారు.?
జ : లంబాడీలు

12) G-4 కూటమిలో గల దేశాలు ఏవి.?
జ : భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్

13) యక్షగానాన్ని తెలంగాణలో ఏమని పిలుస్తారు.?
జ : వీధి భాగవతం

14) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ఆర్కిటెక్ట్ ఎవరు.?
జ : హఫీజ్ కాంట్రాక్టర్

15) పక్షుల వలన జరిగే పలదీకరణాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ఆర్నితోఫీలీ

16) సైనికులకు ఒకే ర్యాంక్ ఒకే పింఛన్ అమలుపై కేంద్రం నియమించిన జ్యుడీషియల్ కమిటీ చైర్మన్ ఎవరు.?.
జ : జస్టిస్ నరసింహారెడ్డి

17) జాతీయ టెక్నాలజీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 11న జరుపుతారు అందుకు గల కారణం ఏమిటి.?
జ : ప్రోఖ్రాన్ – 2 ప్రయోగాన్ని విజయవంతంగా జరిపిన రోజు

18) వృక్ష రాజ్య ఉభయచరాలు అని వేటిని పిలుస్తారు.?
జ : బ్రయో ఫైటా

19) అణు రియాక్టర్లలో ఉపయోగించే భారజలం యొక్క విధి ఏమిటి.?
జ : న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం

20) తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం ఎంత.?
జ : 9.5%