DAILY G.K. BITS IN TELUGU MARCH 4th
1) “ది మ్యాన్ హూ న్యూ ఇనిఫినిటీ” చిత్రాన్ని ఎవరి ఆత్మకథ ఆధారంగా నిర్మించారు.?
జ : ఎస్. రామానుజన్
2) రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం పరిస్థితిని స్టాఫర్డ్ క్రిప్స్ ప్రణాళిక ఏమని అంచనా వేసింది.?
జ : భారత్ కు అధినివేశ రాజ్య హోదా ఇవ్వాలి అని
3) భారత మధ్యయుగ ఆర్థిక చరిత్రలో “అరఘట్ట” అనే పదం దేన్నీ సూచిస్తుంది.?
జ : భూమికి సాగునీరు అందించేందుకు ఉపయోగించే జలచక్రం
4) ఏదైనా రాష్ట్ర జాబితాలోని ఒక అంశం దేశ ప్రయోజనాల రీత్యా ముఖ్యమైనదని భావించినప్పుడు.. దానిపై పార్లమెంటు శాసనం చేయవచ్చు అయితే సదరు తీర్మానాన్ని పార్లమెంటు ఏ విధంగా ఆమోదించాలి.?
జ : సభకు హాజరైన వారిలో 2/3వ వంతు మెజారిటీ తో
5) తొలి ప్రయత్నం లోనే అంగారకుడు పైకి విజయవంతంగా హ్యోమో నౌకను ప్రయోగించిన తొలి దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్
6) వాయు నాణ్యతను పరిశీలించేందుకు ఏ వాయువులను పరిగణలోకి తీసుకుంటారు.?
జ : కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్
7) ప్రపంచ ఆర్థిక స్థిరత్వ నివేదికను రూపొందించే సంస్త ఏది?
జ : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ
8) భారత చరిత్రలో ఘటికలు అంటే ఏమిటి?
జ : దేవాలయాలకు అనుసంధానించిన కళాశాలలు
9) మాంటెక్ చేమ్స్‌ఫర్డ్ ప్రతిపాదనలు దేనికి సంబంధించినవి.?
జ : రాజ్యాంగ సంస్కరణలు
10) సత్యశోధక సమాజం చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి?
జ : మహారాష్ట్రలో కుల వ్యతిరేక ఉద్యమం
11) భారత స్వతంత్ర పోరాటంలో “స్వదేశీ”, “బహిష్కరణ” అనే అంశాలను తొలిసారిగా ఏ సందర్భంలో ఎంచుకున్నారు.?.
జ : బెంగాల్ విభజన తర్వాత చేపట్టిన ఆందోళనలో
12) నారింజ రంగు గుజ్జు కలిగిన అరటి పండ్లను భారతదేశంలో ఎక్కడ కనిపెట్టారు.?
జ : అండమాన్ దీవులలో
13) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ వెల్లడించే సంస్థ ఏది?
జ : ప్రపంచ బ్యాంక్
14) అశోక చక్రవర్తి శాసనాలను తొలిసారిగా చదివిన వారు ఎవరు.?
జ : జేమ్స్ ప్రిన్సెప్
15) భారత మధ్యయుగ చరిత్ర కాలంలో బంజారా లు సాధారణంగా.?
జ : వర్తకులు
16) కుర్దు అనే జాతి ప్రజలు ఏ దేశానికి చెందినవారు.?
జ : బంగ్లాదేశ్
17) రోహింగ్యా లు అనే జాతి ప్రజలు ఏ దేశానికి చెందినవారు.?
జ : మయన్మార్
18) ఒక రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని ఎవరు నియమిస్తారు.?
జ : ఆ రాష్ట్ర గవర్నర్
19) శుంగ వంశ స్థాపకుని కుమారుడి ప్రణయ గాధను తెలియజేసే పుస్తకం ఏది?
జ : మాళవికాగ్ని మిత్ర
20) వేప నూనె పైపూతగా ఉన్న యూరియా అమ్మకాలను భారత్ ప్రభుత్వం ప్రోత్సహించడానికి ప్రధాన కారణం ఏమిటి?
జ : పైపూతగా ఉన్న వేప నూనె, యూరియా భూమిలో కలిగే వేగాన్ని తగ్గిస్తుంది