DAILY G.K. BITS IN TELUGU MARCH 11th
1) రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారు.?
జ : ఉపరాష్ట్రపతి
2) తెలంగాణలో ఏ పట్టణాన్ని దక్షిణ భారతదేశపు బొగ్గు గని అని పిలుస్తారు.?
జ : కొత్తగూడెం
3) ఏ దేవాలయం బ్లాక్ పగోడాగా పిలవబడుతుంది.?
జ : సూర్య దేవాలయం
4) చోళుల పరిపాలన కాలం నాటి ఏ శాసనం గ్రామ పరిపాలన విధానం గురించి తెలియజేస్తుంది.?
జ : ఉత్తర మేరూరు శాసనం
5) విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తానుల మధ్య జరిగిన ఘర్షణ ప్రాంతం ఏది?
జ : రాయచూర్ దో ఆబ్ (అంతర్వేది)
6) అక్బర్ నామా పుస్తక రచయిత ఎవరు.?
జ : అబుల్ ఫజల్
7) మున్సుబ్ దారి విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు.?
జ : అక్బర్
8) తహ్కీక్ ఈ హిందూ గ్రంధం రచించినది ఎవరు? జ : అల్బేరుని
9) గురు గ్రంద్ సాహెబ్ గ్రంధాన్ని ఏ గురువు సంకలనం చేశాడు.?
జ : గురు అర్జున్
10) శివాజీ స్వతంత్ర రాజుగా ఎక్కడ పట్టాభిషేకం చేసుకున్నాడు.?
జ : రాయగడ్
11) అబ్దుల్ రజాక్ అనే విదేశీ యాత్రికుడు ఏ విజయనగర రాజు ఆస్థానాన్ని సందర్శించాడు.?
జ : రెండవ దేవరాయల
12) మొగల్ ఆస్థానంలో గొప్ప గాయకుడు ఎవరు.?
జ : తాన్‌సేన్
13) భారతదేశానికి సముద్ర మార్గాన్ని మొదట కనిపెట్టిన ఐరోపియన్లు ఎవరు.?
జ : పోర్చ్‌గీస్
14) యూరప్ లైబ్రరీలో ఒక బీరువాలోని పుస్తకాలు ఇండియా మరియు అరేబియాలోని మొత్తం సాహిత్యానికి సమానం అని ఎవరు అన్నారు.?
జ : మెకాలే
15) భారతదేశంలో బ్రిటిష్ వారు పొందిన తొలి వర్తక స్థావరం గల ప్రదేశం ఏది.?
జ : సూరత్
16) భారతదేశంలో పిండారీలు, థగ్గులను అణచివేసిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : లార్డ్ డల్హౌసీ
17) అస్పృశ్యులకు కాంగ్రెస్, గాంధీ చేసింది ఏమిటి అనే పేరు గల ప్రసిద్ధ గ్రంథాన్ని రచించినది ఎవరు? జ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
18) బ్రిటిష్ పరిపాలనా కాలంలో గాంధీజీ మొదటి సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు.?
జ : చంపారన్
19) రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకిరి వంటి వాటిని నిషేధించింది.?
జ : ఆర్టికల్ 23 (1)
20) ప్రముఖ నాటకం ‘మా భూమి’ దేనితో సంబంధం కలిగి ఉంది.?
జ : తెలంగాణ సాయుధ పోరాటం