DAILY G.K. BITS IN TELUGU JUNE 13th
1) ప్రతిష్టాత్మక టైలర్ ప్రైజ్ ఏ రంగానికి సంబంధించినది.?
జ : పర్యావరణ పరిరక్షణ
2)భాషా ప్రాతిపాదికను ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్
3) జాతీయ ఎయిడ్స్ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉన్నది.?
జ : పూణే
4) కాంతి శక్తిని ఫోటోసెల్ ఏ విధంగా మారుస్తుంది.?
జ : విద్యుత్ శక్తి
5) ప్రజాస్వామ్యం ఉన్నది ప్రజల చేత – ప్రజల కొరకు – ప్రజలు నడిపే – ప్రభుత్వం అని ఎవరు అన్నారు.?
జ : అబ్రహం లింకన్
6) కాళోజి నారాయణరావు అనువదించిన ఏ రచనకు ఉత్తమ అనువాదకుడిగా సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.?
జ : జీవన గీతం
7) ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్వీయ చరిత్ర పేరు ఏమిటి?
జ : వొడవని ముచ్చట్లు
8) 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి ఎవరు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ
9) దక్కన్ సర్దార్ అనే బిరుదు నెహ్రూ ఎవరికి ఇచ్చారు.?
జ : జమలాపురం కేశవరావు
10) 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి.?
జ : మన జనాభా లెక్కలు – మన భవిష్యత్తు
11) భారతదేశంలో స్వతంత్ర అనంతరం ఎన్నిసార్లు రాజ్యాంగంలోని 360 నిబంధన ప్రకారం అత్యవసర పరిస్థితి విధించబడింది.?
జ : ఎప్పుడు విధించబడలేదు
12) హ్రస్వ దృష్టిని ఏ కటకము ద్వారా సవరించవచ్చ.?
జ : పుటాకార కటకము
13) టేపు రికార్డర్ల మీద మిగిలిన శబ్ద సంబంధ యంత్రాల మీద డాల్బీ బీ లేక డాల్బీ సి అని ముద్రిస్తారు ఈ పదం దేన్నీ సూచిస్తుంది.?
జ : ధ్వని తరంగాలను తగ్గించే సర్క్యూట్
14) నోబెల్ శాంతి బహుమతిని ఏ నగరంలో ఎనౌన్స్ చేస్తారు.?
జ : ఓస్లో
15) టెలిస్కోపులను మైక్రోస్కోప్లను తయారు చేయుటకు ఏ కటకం ఉపయోగిస్తారు.?
జ : కుంభాకార కటకము