Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 26th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 26th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 26th

1) తుంబ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కేరళ

2) అజంతా గుహలు ఉన్న రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర

3) మోహిని అట్టం అనే శాస్త్రీయ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది.?
జ : కేరళ

4) భారత రాజ్యాంగాన్ని “అర్ధ సమాఖ్య” అని అన్నది ఎవరు.?
జ : కే.సీ. వేర్

5) రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.?
జ : బేరు బారి యూనియన్ కేసు (1960)

6) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రాథమిక విధులను గురించి తెలుపుతుంది.?
జ : ఆర్టికల్ 51 (ఏ)

7) ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత.?
జ : రాష్ట్రాలు 28, కేంద్రపాలిత ప్రాంతాలు 8

8) “చట్టం ముందు అందరూ సమానులే” అని పదాన్ని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు.?
జ : బ్రిటన్ రాజ్యాంగం

9) ఆర్టికల్ 79 ప్రకారం భారత పార్లమెంట్ అనగా ఏమిటి.?
జ : లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి.

10) NITI AAYOG పూర్తినామం ఏమిటి.?
జ : నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌పార్మింగ్ ఇండియా ఆయోగ్

11) సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (IADPA) ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు.?
జ : రెండవ పంచవర్ష ప్రణాళిక (1956 – 61)

12) ప్రపంచ జీవ వైవిద్య దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : మే – 22

13) భారతదేశ భూభాగంలో అత్యధిక శాతం ఆక్రమించి ఉన్న నేలలు ఏవి.?
జ : ఒండ్రు మట్టి నేలలు/ఒండలి నేలలు (43.66%)

14) కోర్టులు “డు యువర్ డ్యూటీ” అని ఆదేశిస్తూ జారీ చేసే రిట్ పేరు ఏమిటి?
జ : మాండమాస్

15) సింధు నాగరికతలో అతిపెద్ద ఓడరేవు ఏది?
జ : లోతాల్

16) జైన మత స్థాపకుడు ఎవరు?
జ : ఋషభనాధుడు

17) జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించిన శతాబ్దం ఏది.?
జ : క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం

18) అలెగ్జాండర్ పురుషోత్తముడికి మధ్య జీలం నది ఒడ్డున జరిగిన యుద్ధం పేరు ఏమిటి?
జ : హైడాస్పస్ యుద్ధం

19) కాశ్మీర్ లో శ్రీనగర్ అనే నగరాన్ని నిర్మించిన చక్రవర్తి ఎవరు.?
జ : అశోకుడు

20) “గంగైకొండన్” అనే బిరుదు గల రాజు ఎవరు?
జ : రాజేంద్ర చోళుడు