DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 23rd
1) ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు తాన్‌సేన్ ఏ మొఘల్ చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు.?
జ : అక్బర్
2) 1839వ సంవత్సరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వాహాభి కుట్రకు నాయకత్వం వహించిన హైదరాబాద్ అశోక్ జాయి రాజకుమారుడు ఎవరు.?
జ : ఆజాం ఝా
3) బాబర్ ఆత్మకథ సుజుకి బాబరి మొదట ఏ భాషలో రాయబడింది.?
జ : తుర్కిష్
4) వైదిక కాలంలో నాగలిని ఏమని పిలిచేవారు.?
జ : సిర
5) ప్లాసి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ?
జ : రాబర్ట్ క్లైవ్ – సిరాజ్ ఉద్దౌలా
6) సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ జపాన్ సేనలతో కలిసి బర్మా మరియు భారతదేశంల పైకి దండెత్తినప్పుడు సుభాష్ చంద్రబోస్ ఏమని పిలుపునిచ్చాడు.?
జ : చలో ఢిల్లీ
7) కుతుబ్ షాహీల పరిపాలన కాలంలో ‘మీర్ జూమ్లా’ అనే అధికారి యొక్క బాధ్యత ఏమిటి.?
జ : ఆర్థిక శాఖ
8) 1969 ఉద్యమంలో అమరులైన వారి జ్ఞాపకార్థం హైదరాబాదులోని గన్ పార్క్ స్మారక స్థూపాన్ని రూపొందించిన శిల్పి ఎవరు.?
జ : ఎక్క యాదగిరిరావు
9) ఎవరి పరిపాలన క్రింద హైదరాబాదులో అధికార భాషగా ఉన్న ఉర్దూ బదులు తెలుగు, ఇంగ్లీష్ భాషలను ప్రవేశపెట్టారు.?
జ : ఎంకే వెల్లోడి
10) దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పదిలక్షల జనాభా కంటే ఎక్కువ గల పట్టణాల సంఖ్య ఎంత.?
జ : 53
11) ప్రస్తుతం గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతంలో గల రాష్ట్రాల సంఖ్య ఎంత.?
జ : 8
12) హర్షవర్ధనుడు మోక్ష పరిషత్ ను ఎక్కడ ఏర్పాటు చేశాడు.?
జ : ప్రయాగ
13) ఉత్తర భారతంలో ఏ చక్రవర్తి మరణానంతరం శాతవాహనులు రాజకీయంగా శక్తివంతులైనారు.?
జ : అశోకుడు
14) భారతదేశంలో అత్యంత దక్షిణాన ఉన్న పౌర విమానాశ్రయం ఏది.?
జ : తిరువనంతపురం
15) గోదావరి నది వ్యవస్థ యొక్క అత్యంత తూర్పున ఉన్న ఉపనది ఏది.?
జ : శబరి
16) మార్బల్ (దువధర్ ఫాల్స్) జలపాతం గల నది ఏది.?
జ : నర్మదా
17) 1947 సెప్టెంబర్ రెండవ తేదీన జరిగిన పరకాల మారణ హోమం జలియన్ వాలాబిగ్ ఉదంతంతో పోల్చదగింది. పరకాల ఉద్యమకారుల ధ్యేయం ఏమిటి.?
జ : జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం
18) తెలంగాణ తల్లి విగ్రహానికి రూపు రేఖలను ఇచ్చినది ఎవరు.?
జ : బి వెంకట రమణాచారి
19) ‘నాగేటి సాలళ్ళ నా తెలంగాణ’ గేయ రచయిత ఎవరు.?
జ : నందిని సిదా రెడ్డి
20) ‘ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా’ పాట రచయిత ఎవరు.?
జ : అభినయ శ్రీనివాస్
- GK BITS IN TELUGU 7th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 07
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం