DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 19th
1) బ్యాక్టీరియాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడే తెల్ల రక్త కణాలు ఏవి.?
జ : మోనోసైట్స్
2) బ్యాక్టీరియా, వైరస్ లు ఇతర హానికరమైన పదార్థాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేసే తెల్ల రక్త కణాలు ఏవి.?
జ : లింపో సైట్స్
3) బెంగాల్ విభజన సమయంలోనే యుగాంతర్ పత్రిక ఎడిటర్ ఎవరు.?
జ : భూపేంద్రనాథ్ దత్త
4) జాతీయగీతమును మొదట ఎప్పుడు, ఎక్కడ ఆలపించారు.?
జ : 1911 డిసెంబర్ 27 భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో
5) కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి.?
జ : 13 జిల్లాలలో 18.3 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించడం
6) బంకిం చంద్ర చటర్జీ రచించిన ఏ రచనను ‘ఆధునిక బెంగాలీల దేశభక్తికి బైబిల్’ వంటిదిగా పరిగణిస్తారు.?
జ : ఆనంద్ మఠ్
7) భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్టు ఏది?
జ : శివసముద్రం ప్రాజెక్ట్
8) జాతీయ ఉద్యమ కాలంలో స్వరాజిస్ట్ పార్టీని స్థాపించినది ఎవరు?
జ : సి ఆర్ దాస్
9) జర్మనీ నియంత అడల్ప్ హిట్లర్ రాజకీయ పార్టీ పేరు ఏమిటి?
జ : నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ
10) భారతదేశంలో మొబైల్ ఫోన్ ద్వారా మొదటి సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది.?
జ : జ్యోతి బస్ & సుఖ్‌రాం
11) అధిక నైట్రైట్ ఉన్న నీటిని తాగడం వలన కలిగే వ్యాధి ఏమిటి.?
జ : బ్లూ బేబీ సిండ్రోమ్
12) ‘ఫిలాసఫర్స్ ఫూల్’ అని దేనిని అంటారు.?
జ : జింక్ ఆక్సైడ్ సమ్మేళనము
13) రక్తం యొక్క పిహెచ్ విలువను నియంత్రించే మానవ శరీరంలోని ప్రధాన అవయవాలు ఏమిటి.?
జ : మూత్రపిండాలు, ఊపిరితిత్తులు
14) హంటర్ కమిషన్ ను ఏ అంశంపై నియమించారు.?
జ : విద్య
15) కారాకోరం పర్వత శ్రేణి ఏ దేశాల సరిహద్దుల మధ్య విస్తరించి ఉంది.?
జ : ఇండియా, పాకిస్తాన్, చైనా
16) హైదరాబాద్ నగరం సముద్ర మట్టానికి ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది.?
జ : 500 నుండి 600 అడుగుల ఎత్తులో
17) తెలంగాణలోని ఏ జిల్లాలో ‘కోలం’ తెగ ప్రధానంగా నివసిస్తుంది.?
జ : ఆదిలాబాద్
18) భగత్ సింగ్ రాజ్ గురు మరియు సుఖదేవ్ లను మార్చి 23 1931న ఎక్కడ ఉరితీశారు.?
జ : లాహోర్
19) క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో తెలంగాణకు చెందిన ఈ క్రింది ప్రాంతాలను అస్మక మహాజనపద అని పిలిచేవారు.?
జ : పూర్వపు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు
20) లోక్ సభ మరియు కొన్ని రాష్ట్రాల్లోని శాసనసభలకు ఆంగ్లో ఇండియన్ లను నామినేట్ చేయడానికి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నిరోధించబడింది.?
జ : 104వ రాజ్యాంగ సవరణ
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు