Home > LATEST NEWS > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 17th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 17th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 17th

1) తమిళనాడులోని సిరువాని కొండలు దేనికి ప్రసిద్ధి.?
జ : సీతాకోకచిలుకల సూపర్ హాట్ స్పాట్

2) రాజ్యాంగంలో సమానత్వపు హక్కు సంబంధించి ఎన్ని ఆర్టికల్స్ కలవు.?
జ : 5

3) ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ ను ఎవరు నియమిస్తారు.?
జ : భారత రాష్ట్రపతి

4) ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సైన్యంలో స్త్రీలకై ప్రత్యేకంగా ఏర్పాటు అయినా దళం పేరు ఏమిటి.?
జ : రాణి ఝాన్సీ రేజిమెంట్

5) పాల్వంచ థర్మల్ స్టేషన్ లోని అక్రమాలకు వ్యతిరేకంగా ఖమ్మంలో 1969లో నిరవధిక నిరాహార దీక్షను చేపట్టిన విద్యార్థి నాయకుడు ఎవరు.?
జ : రవీంద్రనాథ్

6) ‘విజ్ఞాన వర్ధిని పరిషత్’ అనే వాగ్మయ సంస్థను 1941లో స్థాపించినది ఎవరు.?
జ : సురవరం ప్రతాపరెడ్డి

7) ‘హైదరాబాద్ అంబేద్కర్’ అని పేరు పొందిన దళిత నాయకుడు ఎవరు.?
జ : బి.ఎస్. వెంకటరావు

8) నృసింహ శతకాన్ని రచించినది ఎవరు.?
జ : ధర్మపురి శేషప్ప

9) మన దేశ గవర్నర్ జనరల్ గా పనిచేసిన ఏకైక భారతీయుడు ఎవరు.?
జ : సి. రాజగోపాల చారి

10) 1922లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ‘రంప తిరుగుబాటుకు’ నాయకత్వం వహించింది ఎవరు.?
జ : అల్లూరి సీతారామరాజు

11) కాకతీయుల కాలంలో ‘మాచల దేవి’ అనే రాజ నర్తకి ఓరుగల్లు లో చిత్ర ప్రదర్శనశాలలు నెలకొల్పింది. అప్పటి కాకతీయ రాజు ఎవరు.?
జ : ప్రతాపరుద్ర దేవుడు

12)ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాష్ట్రపతికి వివిధ అత్యవసర పరిస్థితి ప్రకటనలను వివిధ కారణాల ద్వారా జారీ చేయు అధికారాన్ని ఇచ్చినది.?
జ : 38వ రాజ్యాంగ సవరణ చట్టం

13) ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరాన్ని ఏమని అంటారు.?
జ : అమ్మీటర్

14) 1864లో సికింద్రాబాద్ లో అబ్దుల్ ఖాదీర్ సంపాదకత్వంలో వెలువడిన మొట్టమొదటి ఆంగ్ల వార్త పత్రిక ఏది.?
జ : దక్కన్ టైమ్స్

15) తెలంగాణ జేఏసీ నేతృత్వంలో 2011 మార్చి 10న చేపట్టిన ప్రజా పోరాట ఉద్యమం ఏది.?
జ : మిలియన్ మార్చ్

16) 1985 డిసెంబర్ లో జారీ చేయబడిన జీవో నెంబర్ 610 ముఖ్యంగా ఏ శాఖలోని అసమానతలను తొలగించడానికి ఉద్దేశించబడినది.?
జ : ఉపాధి కల్పన శాఖ

17) “చందా రైలు పథకానికి’ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించి నిజాం ప్రభుత్వ ఆగ్రహానికి పాత్రుడైనది ఎవరు.?
జ : డాక్టర్ అఘోరనాథ చటోపాధ్యాయ

18) నిజాం సంస్థానంలో ‘జిల్లా బంది’ పద్ధతిని ప్రవేశపెట్టడానికి కారణం ఎవరు.?
జ : ఒకటవ సాలార్ జంగ్

19) హిందూ – ముస్లింల ఐక్యతకు సంకేతమైన “సదాకత్ ఆశ్రమాన్ని” స్థాపించినది ఎవరు.?
జ : మహాత్మా గాంధీ

20) కాకతీయ రాజా రుద్ర దేవ గొప్ప యోధుడని, చాళుక్య చోళ రాజైన రెండవ రాజరాజుకు సమకాలీకుడని ఏ శిలాశాసనంలో తెలుపబడినది.?.
జ : ద్రాక్షారామ శాసనం