DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 14th
1) రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి స్థాపనకు ఏర్పాటు చేయబడిన సంస్థ ఏది?
జ : ఐక్యరాజ్యసమితి
2) ఐక్యరాజ్యసమితిలో ప్రధాన అంగాలు ఎన్ని.?
జ : ఆరు
3) గ్రీన్ పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : అమస్టర్ డాం
4) తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మె ఎన్ని రోజులపాటు జరిగింది.?
జ : 42 రోజులు
5) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ని చంద్రమండలం మీదకు పంపిన దేశం ఏది.?
జ : అమెరికా
6) దేశంలో అతి పురాతన నది ఏది.?
జ : గోదావరి
7) పశ్చిమ వైపు ప్రవహించే నదులలో అతి పెద్దది ఏది?
జ : నర్మదా నది
8) నైరుతి రుతుపవనాలు ఏ సముద్రం నుంచి పుడతాయి.?
జ : హిందూ మహాసముద్రం
9) థార్ ఎడారిలో ప్రవహించే ఏకైక నది.?
జ : లూని నది
10) కర్కట రేఖ మనదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది.?
జ : ఎనిమిది రాష్ట్రాల గుండా
11) ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 10
12) అస్పృశ్యత నిషేధం అనేది ఈ హక్కులో భాగం.?
జ : సమానత్వపు హక్కు
13) మొదటి కర్మగారాల చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1881
14) రైలు ఇంజన్ ను కనుగొన్నది ఎవరు?
జ : జార్జ్ సిఫిన్ సన్
15) ప్రజల జీవన ప్రమాణాన్ని అంచనా వేసేందుకు ఉపయోగించే ప్రామాణికం ఏమిటి?
జ : తలసరి ఆదాయం
16) బుర్రకథ పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : నాజర్
17) ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్య హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చింది.?
జ : 86
18) ఆదేశిక సూత్రాలలో పని హక్కు గురించి వివరించే ఆర్టికల్ ఏది?
జ : ఆర్టికల్ 41
19) భారతదేశంలో మొత్తంలో లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య ఎంత.?
జ : 543
20) కడవెండి అనే గ్రామంలో రైతుల ప్రదర్శనలపై జమీందారులు కాల్పులు జరుపగా అమరుడైన వ్యక్తి ఎవరు.?
జ : దొడ్డి కొమరయ్య