DAILY G.K. BITS IN TELUGU 8th NOVEMBER
1) పౌరులకు ఏకరూప పౌర స్మృతిని అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది .?
జ : ఆర్టికల్ – 44
2) రాజ్యసభ సభ్యులు ఎన్ని సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు.?
జ : 6
3) భారత రాజ్యాంగం ప్రకారం పంచాయతీలలో ఎన్నో వంతు స్థానాలు మహిళలకు కేటాయించబడింది.?
జ : 1/3 వంతు
4) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (FICCI) ఎప్పుడు స్థాపించారు.?
జ : 1927
5) భారతదేశంలో స్థానిక పత్రిక చట్టం ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది.?
జ : 1878
6) రాజ్యసంక్రమణ సిద్ధాంతం అమలు ద్వారా ఏ రాజ్యం మొదటగా విలీనం చేయబడింది.?
జ : సతారా
7) వేద సమాజం 1864లో ఎక్కడ స్థాపించబడింది.?
జ : మద్రాస్
8) ప్రణాళికా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది.?
జ : 1950
9) NABARD ( నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) ఏ సంవత్సరం లో స్థాపించారు.?
జ : 1982
10) 2011 – 12 లో భారతదేశంలో దారిద్ర రేఖకు క దిగువన ఉన్న జనాభా శాతం.?
జ : 22%
11) స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్ యోజన కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1999
12) ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం కేంద్రం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది.?
జ : జయశంకర్ భూపాలపల్లి