DAILY G.K. BITS IN TELUGU 7th NOVEMBER

DAILY G.K. BITS IN TELUGU 7th NOVEMBER

1) తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆద్యుడు ఎవరు.?
జ : పాల్కురికి సోమన

2) ప్రజాకవి కాళోజీ నారాయణరావు తొలి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు .?
జ : అమ్మంగి వేణు గోపాల్

3) నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 2007 మార్చి

4) ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమ యోజన (PMJBY) పథకం ఏ వయసుల వారికి అందుబాటులో ఉంది.?
జ : 18 నుండి 50 సంవత్సరాల మధ్య వారికి

5) నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం పథకం (NMMSS) ఏ సంవత్సరం వరకు అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.~
జ : 2025 – 26 విద్యా సంవత్సరం వరకు

6) ఆక్టోపస్ అనేది ఏ వర్గానికి చెందిన జీవి.?
జ : మొలస్కా

7) గాయిటర్ వ్యాధి ఏ మూలకా లోపం వలన వస్తుంది.?
జ : అయోడిన్

8) జీవ రసయన ఉత్ప్రే రకాలు అని వేటిని అంటారు.?
జ : ఎంజైమ్స్

9) ఏ గ్రీన్ హౌస్ వాయువు భూ తాపానికి అత్యధిక కారణం అవుతుంది.?
జ : కార్బన్ డయాక్సైడ్

10) భీమా నది ఏ నదికి ఉపనది.?
జ : కృష్ణా

11) మజూలి ద్వీపం ఏ నదిలో ఉంది.?
జ : బ్రహ్మపుత్ర

12) భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బిరుదుల రద్దును తెలియజేస్తుంది.?
జ : ఆర్టికల్ 18