Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU 7th APRIL

DAILY G.K. BITS IN TELUGU 7th APRIL

DAILY G.K. BITS IN TELUGU 7th APRIL

1) విసునూరు దేశ్‌ముఖ్ దురాగాతలను ఎదిరించిన ఐలమ్మ ఏ గ్రామానికి చెందిన వీరనారి.?
జ : పాలకుర్తి

2) భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాల వివరాలను ఎవరు తయారు చేస్తారు.?
జ : కేంద్ర గణాంక సంస్థ

3) తొమ్మిదో పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడిన సర్వ శిక్ష అభియాన్ ఉద్దేశం ఏమిటి?
జ : ప్రాథమిక విద్యను సార్వజనీయంగా మార్చడం

4) మౌలిక రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల ఏర్పాటు అన్నది ఎందులో అంతర్భాగంగా ఉంది.?
జ : ఆదేశిక సూత్రాలు

5) భారతదేశంలోతొలిసారిగా ఉర్దూ భాషలో పుస్తకం వెలువరించిన రాజు ఎవరు.?
జ : మహమ్మద్ కులీ కుతుబ్ షా

6) ప్రపంచంలో అత్యంత పొడవైన అగ్నిపర్వత గొలుసు ఏ ఖండంలో ఉంది.?
జ : ఆస్ట్రేలియా

7) విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుందని తొలుత గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు?
జ : హాన్స్ క్రిస్టియన్ అయర్ స్టేడ్

8) తెలంగాణ విమోచన ఉద్యమ సమితి చైర్మన్ ఎవరు.?
జ : కాళోజి నారాయణరావు

9) హరిజనులు, అస్పృశులు, పంచములు అనే పదాల బదులు వారిని ఆది ఆంధ్రులు, ఆది హిందువులు అని పిలవాలని అన్నది ఎవరు.?
జ : భాగ్యరెడ్డి వర్మ

10) భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి పేర్కొన్నారు.?
జ : ఏడవ షెడ్యూలు

11) తెలంగాణలో ఎర్ర ఇసుక, లోమ్ మృత్తికలు స్థానికంగా ఎలా పిలవబడతాయి.?
జ : చల్క నేలలు

12)ప్రపంచ నిమోనియా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 12

13) పెట్రోలియంలోని హైడ్రో కార్బన్లను వేరుపరచడంలో ఇమిడి ఉండే సూత్రము ఏది?
జ :అంశిక స్వేదనం

14) భారతదేశంలో అతి పెద్ద మడ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి.?
జ : పశ్చిమబెంగాల్

15) వాతావరణం లోని ఏ పొర ఏకరూప సమాంతర ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.?
జ : స్ట్రాటో ఆవరణం