DAILY G.K. BITS IN TELUGU 15th NOVEMBER
1) శాంతి నికేతన్ సంస్థను ప్రారంభించినది ఎవరు.?
జ : రవీంద్రనాథ్ ఠాగూర్
2) ఒక ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు సక్రమంగా నిర్వహించమని జారీ చేసే రిట్ ఏది.?
జ : మాండమస్
3) హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది.?
జ : సుప్రీం కోర్ట్
4) భారత రాజ్యాంగం ప్రకారం ఎంతమంది రాజ్యసభ సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేయవచ్చు.?
జ : 12
5) ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో సమానత్వాన్ని పాటించాలని సూచించే ఆర్టికల్ ఏది?
జ : ఆర్టికల్ 16
6) భారతదేశం వెలుపల నివసించే నిర్దిష్ట వ్యక్తుల పౌరసత్వ హక్కులను సూచించే ఆర్టికల్ ఏది?
జ : ఆర్టికల్ 8
7) భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను సూచించే ఆర్టికల్ ఏది?
జ : 51 (A)
8) గంగానది ఏ ప్రాంతంలో పర్వతాల నుండి మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.?
జ : హరిద్వార్
9) భారతదేశంలోని పశ్చిమ తీరంలోని దక్షిణ భాగాన్ని ఏ తీరం అని పిలుస్తారు.?
జ : మలబార్ తీరం
10) సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఏ హిమాలయాలు అంటారు.?
జ : కుమావోన్
11) సరిస్కా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : రాజస్థాన్
12) నీటిలోని సేంద్రియ పదార్థాల పరిమాణాన్ని తెలిపే అంశం ఏది.?
జ : బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్