DAILY G.K. BITS IN TELUGU 11th JUNE

GK BITS

DAILY G.K. BITS IN TELUGU 11th JUNE

1) ఏ పాము తన గూడును తనే కట్టుకుంటుంది.?
జ : కింగ్ కోబ్రా

2) ప్రసిద్ధ రామప్ప దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జ : పాలంపేట

3) వెనుకబడిన దేశాలలో నిరుద్యోగిత ఏ రకంగా ఉంటుంది.?
జ : ప్రచ్ఛన్న నిరుద్యోగం

4) శూన్యం నుంచి 6 ఏళ్ల వయసు గల ప్రతి 1000 మంది బాలురకు అదే వయసు గ్రూపులో ఉండే బాలికల సంఖ్య దేన్ని సూచిస్తుంది.?
జ : శిశు లింగ నిష్పత్తి

5) స్వతంత్ర అనంతరం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ ఏది.?
జ : కేంద్రీయ గణాంక సంస్థ

6) రాగ్నర్ నర్క్స్ ప్రకారం వెనుకబడిన చాలా దేశాలు ఏ ప్రధాన సమస్య ఎదుర్కొంటున్నాయి.?
జ : పేదరిక విశవలయాలు

7) బాల కార్మిక నిషేధ మరియు నిర్మూలన చట్టం – 1986 ను సిఫార్సు చేసిన కమిటీ ఏది.?
జ : గురుపాదస్వామి కమిటీ

8) ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిస్టబ్డ్ చిల్డ్రన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1974

9) వాహనాలలోని ఏ రసాయనము ప్రమాద సమయంలో నైట్రోజన్ వాయువును విడుదల చేసి ఎయిర్ బ్యాగులు విచ్చుకోవడంలో తోడ్పడుతుంది.?
జ : సోడియం ఎజైడ్

10) మానవుని దేహ ఉష్ణోగ్రతను నియంత్రించేది ఏది?
జ : హైపోథాలామస్

11) వేప చెట్టులో డై బ్యాక్ వ్యాధికి కారణం ఏమిటి .?
జ : శీలింద్రము

12) ఆకాష్ క్షిపణిని అభివృద్ధి మరియు ఉత్పత్తి చేసిన సంస్థ ఏది?
జ : డి ఆర్ డి ఓ మరియు బీడీఎల్

13) సుబ్రహ్మణీయన్ కమిటీ 2014 దేనికి సంబంధించినది.?
జ : పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖకు సంబంధించిన ప్రక్రియలను చట్టాలను సమీక్షించడం

14) వ్యక్తి నిర్బంధ చట్టబద్ధతకు సవాలు ఎదురైనప్పుడు దాఖలు చేసే రిట్ ఏది.?
జ : హెబీయస్ కార్పస్

15) తూర్పు చాళుక్యుల రాజధాని ఏది.?
జ : వేంగి