DAILY CURRENT AFFAIRS IN TELUGU 26 FEBRUARY 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 26 FEBRUARY 2022

Q1. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన పాట్నా పైరేట్స్‌ను ఓడించి తొలిసారిగా ప్రొ కబడ్డీ లీగ్ 2022 టైటిల్‌ను గెలుచుకున్న కబడ్డీ జట్టు ఏది?
జ: దబాంగ్ ఢిల్లీ.

Q2. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక బోల్ట్జ్‌మన్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు?
జ: సీనియర్ భౌతిక శాస్త్రవేత్త దీపక్ ధర్.

Q3. పాకిస్తాన్ సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చేరుకున్న మొదటి హిందువు ఎవరు?
జ: కైలాష్ కుమార్.

Q4. రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్‌కు భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
జ: మనోజ్ మహపాత్ర
.

Q5. ఇండస్ టవర్స్‌లో వోడాఫోన్ వాటాలో ఎంత శాతాన్ని కొనుగోలు చేసేందుకు టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ఒప్పందంపై సంతకం చేసింది?
జ: 4.7 శాతం.

Q6. ఉర్దూ భాషకు సాహిత్య అకాడమీ అవార్డు 2021 ఎవరికి లభించింది?
జ: చంద్రభాన్ ఖయాల్.

Q7. US సుప్రీం కోర్టులో మొదటి నల్లజాతి మహిళ న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
జ: కాటెన్జీ బ్రౌన్ జాక్సన్.

Q8. మనీలాండరింగ్‌కు పాల్పడినందుకు ఏ పాకిస్థాన్ బ్యాంక్‌పై అమెరికా రూ. 5.5 కోట్ల జరిమానా విధించింది?
జ: నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్.

Q9. LIC లో ఎంత శాతం FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) లకు అనుమతిస్తూ కేంద్ర కేబినేట్ అమోదం తెలిపింది.?
జ :- 20%

Q10. శ్రీలంకతో జరిగిన రెండో టీట్వంటీ లో గెలుపుతో భారత్ స్వదేశంలో వరుసగా ఎన్ని టీట్వంటీ సిరీస్ లు గెలుచుకుంది. అలాగే ఓటమి లేకుండా వరుసగా ఎన్నో మ్యాచ్ గెలుపు ఇది.?
జ :- 7వ సిరీస్, 11వ మ్యాచ్

Q11. తెలంగాణ ప్రభుత్వం కౌమార బాలికలలో (11 – 14 ఏళ్ళు) ఏ లోపాన్ని తగ్గించడానికి పౌష్టికాహార కిట్ అందిస్తుంది.
జ :- రక్తహీనత

Q12. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమం కోసం కేంద్రం కేబినెట్ ఎన్ని కోట్లు విడుదల చేసింది.
జ : 1600 కోట్లు

Q13. భారత్ నౌక దళం నిర్వహిస్తున్న మిలాన్ – 2022 కార్యక్రమం ఏ నగరంలో జరిగుతుంది.?
జ :- విశాఖపట్నం