CURRENT AFFAIRS, 22nd October 2020


● గ్రే లిస్టులోనే పాకిస్థాన్.

ఉగ్రసంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్తాన్‌ను ‘గ్రే లిస్ట్’లోనే కొనసాగించాలని అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) నిర్ణయించింది. అక్టోబర్ 21-23 వరకు వర్చువల్ విధానంలో జరిగిన ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం 2021, ఫిబ్రవరి వరకు అమల్లో ఉంటుంది. ‘సునిశిత పర్యవేక్షణ అవసరమైన జాబితా(గ్రే లిస్ట్)లోనే పాకిస్తాన్‌ను కొనసాగించాలని నిర్ణయించాం’ అని ఎఫ్‌ఏటీఎఫ్ అధ్యక్షుడు మార్కస్ ప్లీయర్ వెల్లడించారు.


● హిమాలయలకు భారీ భూకంప ముప్పు.


సువివాలమైన భారతదేశానికి పెట్టని కోటలా ఉన్న హిమాలయాలకు భారీ భూకంపాల ముప్పు ఉందని తాజా అధ్యయనం తేల్చింది. హిమాలయాల శ్రేణిలో రిక్టర్ స్కేలుపై 8 కంటే తీవ్రత ఉండే భూకంపాలు సంభవిస్తాయని చెప్పింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-కోల్‌కతా, అమెరికాకు చెందిన నెవడా యూనివర్సిటీలకి చెందిన నిపుణుల బృందం ఈ విషయాలను వెల్లడించింది.  ఎంత లేదన్నా 100 సంవత్సరాల్లోపే పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని పరిశోధనలో పాల్గొన్న జియాలజీ, సిస్మోలజీ నిపుణుడు వెస్నౌస్కీ తెలిపారు.


● నూతన పార్లమెంట్ భవనం ఎప్పటికీ పూర్తి కానుంది.?

పార్లమెంటు నూతన భవన నిర్మాణం 2020, డిసెంబర్‌లో మొదలుపెట్టి 2022 అక్టోబర్ నాటికి పూర్తిచేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అధికారులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తెలిపారు. పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అక్టోబర్ 23న సమీక్ష సమావేశం సందర్భంగా అధికారులు ఈ మేరకు వెల్లడించారు. 


●ప్రపంచ కార్మిక సంస్థ పాలకమండలి అధ్యక్షుడిగానియమించబడ్డ భారతీయుడు ఎవరు.?


 జెనీవా (స్విట్జర్లాండ్) లో ఉన్న ప్రపంచ కార్మిక సంస్థ(ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్-ఐఎల్‌వో) పాలకమండలి అధ్యక్షుడిగా కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఎన్నికయ్యారు. 2021 జూన్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత్‌కు ఐఎల్‌వో అధ్యక్ష పదవి దక్కడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2020, నవంబర్‌లో జెనీవాలో జరిగే పాలకమండలి సమావేశానికి అపూర్వ చంద్ర అధ్యక్షత వహిస్తారు. ప్రపంచ కార్మిక సంస్థ విధానాలు, కార్యక్రమాలు, అజెండా, బడ్జెట్, డెరైక్టర్ జనరల్ ఎంపికలో పాలకమండలి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 187.  

● ఏ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కి DGCI అమోదం లబించింది.?


కోవిడ్-19 టీకా కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అక్టోబర్ 22న ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో 18 ఏళ్లు, ఆ పైబడిన 28,500 మందిపై కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్, కేంద్ర ప్రభుత్వ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కలిసి దేశీయంగా ఈ టీకాను అభివృద్ధి చేస్తుంది.


● ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.?

స్కిల్ కాలేజీల్లో శిక్షణ ఇచ్చేందుకు మూడు ప్రముఖ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. అక్టోబర్ 22న స్కిల్  డెవలప్‌మెంట్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డెల్ టెక్నాలజీస్, జేబీఎం ఆటో లిమిటెడ్, సీఐఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ ప్రతినిధులతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. 

●  ‘బ్యాగ్ ఆన్ వీల్స్’  కార్యక్రమాన్ని ప్రారంభించిన రవాణా సంస్థ ఏది.?

ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే శాఖ మరో కొత్త సేవలకు శ్రీకారం చుట్టనుంది. దేశంలో రైల్వే ప్రయాణికులకు ‘బ్యాగ్ ఆన్ వీల్స్’ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. తొలుత ఘజియాబాద్, ఢిల్లీ, గుర్గావ్ తదితర స్టేషన్లలో బ్యాగ్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించేందుకు ఉత్తర రైల్వే రంగం సిద్ధం చేసింది.


● ఎక్కడ జరగాల్సిన  ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్  రద్దు అయినది.?

2021 ఏడాదికి వారుుదా పడ్డ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2020 పూర్తిగా రద్దరుుంది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అక్టోబర్ 22న ప్రకటించింది. మహమ్మారి వల్ల ఏర్పడిన అనిశ్చితి ఇంకా తొలగకపోవడం… ఆటగాళ్ల ఆరోగ్య భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ తాము ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీ థామస్ లుండ్ తెలిపారు. వాస్తవానికి ఈ టోర్నీ న్యూజిలాండ్ వేదికగా 2020 ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో జరగాల్సి ఉండగా… కరోనా వల్ల 2021 ఏడాది జనవరికి వాయిదా పడింది. 2020 చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కోల్పోరుున న్యూజిలాండ్‌కు… 2024లో ఆ కోరిక తీరనుంది. ఈ మేరకు 2024 చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులను న్యూజిలాండ్‌కు ఇస్తూ బీడబ్ల్యూఎఫ్ నిర్ణయం తీసుకుంది. 2021 చాంపియన్‌షిప్  చైనా వేదికగా జరగాల్సి ఉంది.

Follow Us @