TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st AUGUST 2022

TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st AUGUST 2022

1) మలేషియా కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్

2) హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్  హిసార్ విమానాశ్రయం పేరును ఎలా మారుస్తున్నట్లు ప్రకటించారు.?
జ : మహారాజా అగ్రసేన్ అంతర్జాతీయ విమానాశ్రయం

3)  భారతదేశంలో అత్యంత ఎత్తులో మూలికల పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది.?
జ : ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ‘మన’ గ్రామంలో

4) BARC ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నకుల్ చోప్రా

5) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిష్టాత్మక ‘ఉభర్తే సితారే ఫండ్’(USF)ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిధులు ఎవరు సమకురుస్తారు.?
జ : ఎగ్జిమ్ బ్యాంక్ మరియు SIDBI

6) USF కార్యక్రమం లక్ష్యం ఏమిటి.?
జ : ఎగుమతి ఆధార సంస్థలు మరియు స్టార్టప్‌ల కోసం… సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా కంపెనీల ప్రమోషన్ కోసం నిధులను ఏర్పాటు చేయడం.

7) ఇటీవల కన్నుమూసిన యూపీ మాజీ సీఎం పేరు ఏమిటి
జ : కళ్యాణ్ సింగ్

8) 17వ ప్రవాసీ భారతీయ దివస్ 2023 వచ్చే ఏడాది జనవరిలో ఎక్కడ జరగనుంది.?
జ : ఇండోర్‌

9) భారతదేశం మరియు ఇరాన్ ప్రాంతీయ అభివృద్ధి కోసం ఏ పోర్టు ను అభివృద్ధి చేయాలని రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.?
జ : చాబహార్ పోర్ట్

10) సంక్షోభంలో చిక్కుకున్న పొరుగుదేశమైన శ్రీలంకకు భారత్ ఎన్ని టన్నుల రసాయన ఎరువులను అందజేసింది.?
జ : 21,000 టన్నుల

11) 2025 నాటికి దేశ బయో ఎకానమీ 70 బిలియన్ల నుండి ఎన్ని బిలియన్ యుఎస్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.?
జ : 150 బిలియన్

12) ఏ రాష్ట్రంలో సురక్షితమైన తాగునీరు & నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య సేవలను మెరుగుపరచడానికి ADB మరియు భారత ప్రభుత్వం 96.3 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.?
జ : హిమాచల్ ప్రదేశ్‌లో

13) బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి రైతులకు విత్తనాలు పంపిణీ చేయనున్న మొట్టమొదటి రాష్ట్రం ఏది.?
జ : జార్ఖండ్

14) ప్రాథమిక విద్య కోసం విద్య రథ్ – స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం ప్రవేశ పెట్టిన రాష్ట్రం ఏది.?
జ : అస్సాం

15) భారత్ కు చెందిన 7 పురాతన వస్తువులను తిరిగి భారత్ కు అందిచడానికి అంగీకరించిన దేశం ఏది.?
జ : స్కాట్లాండ్