Q1. జపోరిజియా అణు విద్యుకేంద్రం ఏ దేశంలో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటి.?
జ :- ఉక్రెయిన్ (యూరప్ లో అతి పెద్ద అణు విద్యుకేంద్రం)
Q2. జియో వరల్డ్ సెంటర్ ని రిలయన్స్ ఏ నగరంలో ప్రారంభించింది.?
జ :- ముంబై
Q3. రైల్వే లో కవచ్ అనే వ్యవస్థ దేనికి ఉపయోగపడుతుంది.?
జ:- ఎదురెదురుగా వచ్చే రైళ్ల ప్రమాదాల నివారణకు
Q4. చెన్నై మహా నగరం మేయర్ గా తాజాగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ :- ఆర్. ప్రియ (తొలి దళిత మహిళ)
Q5. తాజాగా ఐరాస ఓటింగ్ ఎందుకోసం జరిపింది.?
జ:- ఉక్రెయిన్ లో రష్యా దాడులపై మానవ హక్కుల ఉల్లంఘన పై అంతర్జాతీయ కమిషన్ ఏర్పాటు కోసం
Q6. 2030 వరకు ఎన్ని గిగా వాట్ల శిలాజేతర ఇంధనం ఉత్పత్తిని లక్ష్యం గా పెట్టుకున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.?
జ :- 500 గిగా వాట్ల
Q7. ప్రపంచ అథ్లెటిక్స్ లో తాజాగా భారత్ ఏ విభాగంలో కాంస్య పతకం తొలిసారిగా సాదించింది.?
జ:- మహిళల వాకింగ్ టీమ్ చాంపియన్ షిప్ (భావన, రవీనా, మునితా)
Q8. తెలంగాణ లో ప్రారంభించిన “హెల్త్ ప్రొఫైల్” కార్యక్రమం లక్ష్యం ఏమిటి.?
జ:- 18 ఏళ్ళు పైబడిన పౌరులందరి ఆరోగ్య సమాచారంతో కూడిన డిజిటల్ కార్డులు పంపిణీ
Q9. టెస్ట్ క్రికెట్ లో ఏడో స్థానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాదించిన భారత్ క్రికెటర్ గా ఎవరు నిలిచారు.?
జ :- రవీంద్ర జడేజా (175*) కపిల్ దేవ్ (163) పేరిట ఉన్న రికార్డు తిరగరాశాడు.
Q10. రవిచంద్రన్ అశ్విన్ తాజాగా శ్రీలంకతో మ్యాచ్ లో 432 వికెట్లు సాదించి ఎవరి రికార్డు బ్రేక్ చేశాడు.?
జ :- రిచర్డ్ హ్యాడ్లీ (431)
Follow Us @