DAILY CURRENT AFFAIRS IN TELUGU 17th MARCH 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 17th MARCH 2022

Q1. ప్యుర్టరికో రాజధాని శాన్ జువాన్ లో 70వ ప్రపంచ సుందరి (2021) పోటీలలో మిస్ వరల్డ్ గా నిలిచిన యువతి ఎవరు.?
జ :- కరోలినా బైలావ్ స్కా (పోలాండ్)

Q2. 94వ ఆస్కార్ అవార్డుల (2022) ఫైనల్ కి నామినేట్ అయినా భారతీయ చిత్రం.?
జ:- WRITING THE FIRE

Q3. తాజాగా భారత్ ఏ దేశం నుండి 30 లక్షల బారెళ్ళ ముడి చమురును తక్కువ ధరకే కోనుగోలు చేసింది. ?
జ :- రష్యా

Q4. ఐరోపా అత్యున్నత మానవ హక్కుల సంఘం “ది కౌన్సిల్ ఆఫ్ ఐరోపా” ఏ దేశాన్ని బహిష్కరించింది.?
జ :- రష్యా

Q5. హైడ్రోజన్ ఇంధనంగా “ఆడ్వాన్సుడ్ ప్యుయల్ సెల్ విద్యుత్ వాహనం” (FCEV) ను విడుదల చేసిన కంపెనీ ఏది.?
జ :- టయోటా

Q6. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు యొక్క ఏ సంఘటన కు గుర్తుగా పోస్టల్ శాఖ తపాలా కవర్ ని విడుదల చేసింది.?
జ :- మిరపకాయ టపా (100 సం.)

Q7. ఖైదీల వివరాలను డిజిటలీకరణం చేయడానికి రూపొందించిన ఏ బిల్లును కేంద్ర మంత్రి మండలి అమోదించింది.
జ :- ఖైదీల గుర్తింపు బిల్లు

Q8. అంటార్కిటికా లో పరిశోదన లకు గాను రూపొందించిన ఏ బిల్లు ను కేంద్ర కేబినెట్ అమోదించింది.
జ : ది ఇండియన్ అంటార్కిటికా బిల్లు

Q9. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ :- వికాస్ రాజ్

Q10. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) ఏ దేశాన్ని సస్పెండ్ చేసింది.?
జ :- రష్యా

Q11. తాజాగా చెస్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ (IM) సాధించిన తెలుగు క్రీడాకారులు ఎవరు.?
జ:- ఉప్పల ప్రణీత్, సాహితి వర్షిణి

Q12. ఫిబ్రవరి 2022కి ICC ‘పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ICC ఇటీవల ఎవరిని ఎంపిక చేసింది?
జ:- శ్రేయాస్ అయ్యర్

Q13. ఫిబ్రవరి 2022 కోసం ICC ‘మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ICC ఇటీవల ఎవరిని ఎంపిక చేసింది?
జ:- అమేలియా కెర్

Q14. దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్ (ARTPARK) ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
జ:- బెంగళూరు, కర్ణాటక

Q15. ఇటీవల జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ:- 16 మార్చి

Q16. మిషన్ ఇంద్రధనుష్ కింద 90.5% కవరేజీతో భారతదేశంలోని సంపూర్ణ రోగనిరోధకత జాబితాలో ఇటీవల ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
జ:- ఒడిశా

Q17. ఇటీవల హర్యానాలోని ఏ నగరంలో, అహింసా విశ్వ భారతి సంస్థ భారతదేశపు మొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది?
జ:- గురుగ్రామ్

Q18. ఇటీవల ఏ దేశ మాజీ అధ్యక్షుడు రూపయ్ బండా మరణించారు?
జ:- జాంబియా

Q19. ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటి డిజిటల్ వాటర్ బీటా బ్యాంక్ ప్రారంభించబడింది?
జ:- కర్ణాటక

Q20. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదిక 2021 ప్రకారం, ఏ దేశం అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా అవతరించింది?
జ:- భారతదేశం

Q21. ఇటీవల ఏ దేశంతో భారత ప్రభుత్వం 1 బిలియన్ క్రెడిట్ లైన్‌పై సంతకం చేసింది?
జ:- శ్రీలంక