11 మార్చి 2022 కరెంట్ అఫైర్స్ Q & A

Q1.రష్యా – ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల స్థాయిలో శాంతి చర్చలు ఏ దేశంలో జరిగాయి.
జ :- టర్కీ లోని అంటిల్యాలో

Q2. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఏ దేశంతో తన సంబంధాలను పూర్తిగా తెంచుకుంది.
జ :- రష్యా

Q3. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ ఏది.?
జ :- ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)

Q4. సెబీ పూర్తికాల సభ్యుడిగా కేంద్రం ఎవరిని నియమించింది.
జ :- అశ్విన్ భాటియా (SBI ఎండీ)

Q5. పోలీస్ రక్షణ విభాగంలో స్కోచ్ అవార్డు లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ :- ఆంధ్రప్రదేశ్

Q6. డైసీ రాక్ వెల్ ఇంగ్లీష్ లోకి అనువదించబడి… బుకర్ ప్రైజ్ 2022 బహుమతి కోసం ఎంపికైన తొలి హిందీ నవల ఏది. రచయిత ఎవరు.?
జ :- టూంబ్ అండ్ శాండ్ (రేత్ సమాది) – గీతాంజలి శ్రీ.

Q7. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 9వ ప్రాంతీయ కార్యాచరణ బృందం ప్రసంగంలో కేటీఆర్ తెలంగాణలో ఎన్ని గిగా వాట్ల సౌర విద్యుత్ తెలంగాణ ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు.?
జ :; 4.2 గిగా వాట్లు

Q8. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు.?
జ :- మార్చి – 10.

Q9. ప్రైవేటీకరిస్తున్న సంస్థలు లేదా మూసివేస్తున్న ప్రైవేట్‌ రంగ సంస్థలకు సంబంధించిన మిగులు స్థలాలు, భవంతులను మానిటైజ్‌ చేయడానికి కేంద్రం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పేరు.?
జ :- నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్

Q10. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ వ్యవసాయం కోసం మెగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది?
జ:- ఢిల్లీ ప్రభుత్వం

Q11. ‘కౌశల్య మాతృత్వ యోజన’ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది?
జ:- ఛత్తీస్‌గఢ్

Q12. WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇటీవల ఎక్కడ స్థాపించబడింది?
జ:- జామ్‌నగర్

Q13. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మాతృశక్తి ఉద్యమిత యోజనను ప్రకటించింది?
జ:- హర్యానా

Q14. ప్రపంచవ్యాప్తంగా ధూమపాన నిషేధ దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- 9 మార్చి

Q15. ఇటీవల ఏ ఒలింపిక్ ఛాంపియన్ పోల్ వాల్ట్‌లో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు?
జ:- అర్మాండ్ గుస్టావ్ డుప్లాంటిస్

Q16. ఇటీవల ఇటలీలో జరిగిన గ్రాండిస్చి కాటోలికా ఇంటర్నేషనల్ ఓపెన్‌లో విజేతగా ఎవరు ప్రకటించబడ్డారు?
జ:- ఎస్ ఎల్ నారాయణన్

Q17. ఇటీవల US ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు 2022కి ఎవరు ఎంపికయ్యారు?
జ:- రిజ్వానా హసన్

Q18. గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పేపర్ బ్యాలెట్ల స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో ప్రతిపాదనను ఇటీవల ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది?
జ:- అస్సాం

Q19. ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ (IAFA)కి కమాండెంట్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ:- బి చంద్రశేఖర్

Follow Us @