DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th OCTOBER 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 28th OCTOBER 2022

1) అక్టోబర్ 28, 29 తేదీలలో ఐరాస సెక్యూరిటి కౌన్సిల్ కౌంటర్ టెర్రరిజం కమిటీ సమావేశాలు భారత్ లో ఏ నగరాలలో జరగనున్నాయి.?
జ : ముంబై, డిల్లీ

2) నూతనంగా కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఎలిఫెంట్ రిజర్వ్ కు అమోదం తెలిపింది.?
జ : టెరాయి ఎలిఫెంట్ రిజర్వ్ (ఉత్తరప్రదేశ్)

3) 2022 నూతనంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్ లకు అమోదం తెలిపింది.?
జ : లెమ్రూ (చత్తీస్‌ఢ్), అగస్త్యమలై (తమిళనాడు) టెరాయి (యూపీ)

4) జల్ జీవన్ మిషన్ లో బాగంగా హర్ ఘర్ జల్ పథకం కింద ఇటీవల ఏ రాష్ట్రం 100% నల్లా కనెక్షన్ కలిగిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : గుజరాత్

5) జల్ జీవన్ మిషన్ పథకం థీమ్ ఏమిటి, ఎప్పుడు ప్రారంభించారు.?
జ : NO ONE LEFT OUT & 2019

6) భారత సైన్యం అక్టోబర్ 27న ఎన్నో ఇన్‌ఫాంట్రీ దినోత్సవం జరుపుకుంది.?
జ : 76వ

7) COP27 (conference of parties ) సమావేశాలు నవంబర్ 6 – 18 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : షర్మ్ ఎల్ షేక్ (ఈజిప్ట్)

8) నాసా తాజా అధ్యయనం ప్రకారం అంటార్కిటికా ఖండం వద్ద ఓజోన్ రంధ్రం పరిమాణం ఎంత.?
జ : 23.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు

9) ఓజోన్ పొర భూమి చుట్టూ ఏ ఆవరణలో ఉంది. దాని ఉపయోగం ఏమిటి.?
జ : స్ట్రాటో ఆవరణం, UV కిరణాల నుంచి భూమి ని రక్షిస్తుంది.

10) అంధుల టీట్వంటీ క్రికెట్ ప్రపంచ కప్ 2022 కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : యువరాజ్ సింగ్

11) “FROM DEFENCE TO SELF RELIANCE” పుస్తక రచయిత ఎవరు.?
జ : బిమల్ జలాన్

12) విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించెందుకు “హనెస్టి షాప్స్” ను ఏ రాష్ట్రం ప్రారంభించింది.?
జ : కేరళ