CURRENT AFFAIRS Q&A : 21 అక్టోబర్ 2022

1) “గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్” (ఆధ్యాత్మిక హరిత దేవాలయం) 2022 – 2025 అవార్డు తెలంగాణ లోని ఏ దేవాలయం ఎంపికయ్యింది.?
జ : యాదాద్రి దేవాలయం

2) చంద్రయాన్ – 3 కార్యక్రమం ఎప్పుడు ఇస్రో నిర్వహించనుంది.?
జ : జూన్ – 2023

3) ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు.?
జ : ఎస్. సోమనాధన్

4) ఐరాస ప్రధాన కార్యదర్శి గుటేరాస్ తో కలిసి ప్రధాని మోడీ ప్రారంభించిన పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : మిషన్ లైఫ్ (Life style for Environment)

5) 10 లక్షల మంది యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కేంద్రం ప్రారంభించనున్న పథకం పేరు ఏమిటి.?
జ : రోజ్ గార్ మేళా

6) ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ బ్రాండ్ కలిగిన హోటల్ ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన బ్రాండ్ ఏది.?
జ : తాజ్ హోటల్ (భారత్)

7) ఐదవ ‘ఖేలో ఇండియా యూత్ క్రీడలు 2022’ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి.?
జ : మద్యప్రదేశ్

8) ఆసియాలో అతిపెద్ద కంప్రె‌స్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ని భారత్ లో ఎక్కడ ప్రారంభించారు.?
జ : సంగ్రూర్ (పంజాబ్)

9) కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఎకౌంట్స్ (CGA) గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : భారతి దాస్

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

10) ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్స్ మరింత సన్నగా తయారు చేయడానికి ఉపయోగపడే ఏ పెర్రో అయస్కాంత పదార్థాన్ని అమెరికా శాస్రవేత్తలు కనిపెట్టారు.?
జ : జిర్కోనియం డై ఆక్సైడ్

11) హురూన్ ఇండియా దాతృత్వ జాబితా 2022 ప్రకారం దేశంలో అత్యధికంగా దానం చేసిన వారు ఎవరు.?
జ : శివనాడార్ (1161 కోట్లు) (HCL వ్యవస్థాపకుడు)

12) పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 21

13) డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించిన పూర్తి స్వదేశి పరిజ్ఞానం తో రూపొందించిన మద్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి.?
జ : అగ్ని ప్రైమ్

14) ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ పోర్స్ సంస్థ ఏ దేశాన్ని గ్రే లిస్ట్ నుండి తొలగించింది.?
జ : పాకిస్థాన్

Follow Us @