1) భౌతిక శాస్త్రంలో నోబెల్ 2022 అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : అలెన్ ఆస్ఫెక్ట్, జాన్.ఎఫ్. క్లాజర్, అంటోన్ జిలింగర్
2) భౌతిక శాస్త్రంలో నోబెల్ 2022 అవార్డు ఏ పరిశోధనలకు దక్కింది.?
జ : క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఫోటాన్స్ పై పరిశోధనలకు
3) కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లను చైతన్య పరచడానికి రేడియో లలో ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : MATDATA JUNCTION
4)అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : డా. వివేక్ లాల్
5) 2022 లో ప్రపంచ అత్యుత్తమ ఎయిర్ లైన్స్ గా ఏ సంస్థ నిలిచింది.?
జ : ఖతార్ ఎయిర్ వేస్
6) ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : మనీలా
7) భారత్ లో మొదటిసారి గా ఏ రాష్ట్రంలో లిథియం – అయాన్ బ్యాటరీ ల తయారీ పరిశ్రమ నెలకొల్పనున్నారు.?
జ : ఆంధ్రప్రదేశ్
8) ఆస్కార్ 2023 అవార్డులకు భారత్ తరపున నామినేట్ అయిన చిత్రం ఏది.?
జ : ఛెల్లో (గుజరాతి సినిమా)
9) 40 అడుగుల వీణ ను ఎక్కడ ఆవిష్కరించారు.?
జ : లతా మంగేష్కర్ చౌక్ (అయోధ్య).
10) మంగళయాన్ ప్రాజెక్టు పని ముగిసినట్లు అక్టోబర్ 3న ఇస్రో ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ఏ గ్రహం మీద పరిశోదధలు చేసింది.?
జ : అంగారక గ్రహం
11) మంగళయాన్ ఆర్బిటార్ ను ఏ తేదీన ప్రయోగించారు.?
జ : నవంబర్ – 05 – 2013
12) మంగళయాన్ ఆర్బిటార్ ను ఏ తేదీన అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది.?
జ : 2014 – సెప్టెంబర్ – 24న
13) 2022 వైద్య నోబెల్ విజేత స్వాంటే పాబో ఏ జాతి ని గుర్తించారు.?
జ : డెనిసోవన్
14) ప్రస్తుత మానవుల హోమో సెపియన్స్ లలో ఏయో జాతుల జన్యువులు కలిసి ఉన్నాయని స్వాంటే పాబో గుర్తించారు.?
జ : నియాండర్తల్ – డెనిసోవన్
15) తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు.?
జ : బోయినపల్లి వినోద్ కుమార్
16) తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎవరు.?
జ: పల్లా రాజేశ్వర్ రెడ్డి