25 సెప్టెంబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) యస్ బ్యాంకు తాత్కాలిక చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆర్.గాంధీ

2) చైనా కు చెందిన సీనోజిన్ బయోటెక్నాలజీ సంస్థ అంతరించి పోతున్న ఆర్కిటిక్ తోడేలు ను క్లోనింగ్ కమ్ సరోగసీ విధానంలో సృష్టించింది. దీనికి ఏ పేరు పెట్టారు.?
జ : మాయా

3) ప్రస్తుతం బ్రిటన్ హోమ్ శాఖ మంత్రి గా భారత సంతతికి చెందిన మహిళ కొనసాగుతున్నారు. ఆమె పేరు ఏమిటి.?
జ: సుయోలా బ్రావెర్మన్

4) ఇటీవల విశాఖ సముద్ర తీరంలో జలప్రవేశం చేసిన రెండు యుద్ధ వాహక నౌకలు ఏవి.?
జ : నిస్తార్, నిపుణ్

5) ఆస్ట్రేలియా నిర్వహిస్తున్న ‘కకడ్ – 22’ నౌకదళ విన్యాసాలలో భారత తరపున పాల్గొన్న యుద్ధ నౌక ఏది.?
జ : ఐఎన్ఎస్ – సాత్పురా

6) 7వ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కాంక్లేవ్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు.?
జ : హైదరాబాద్

7) ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్ ని ఏర్పాటు చేసుకున్న బ్యాంకు ఏది.?
జ : యూబీఐ (యూనీయన్ బ్యాంకు ఆఫ్ ఇండియా)

8) ఇటీవల మహారత్న హోదా పొందిన 12 భారతీయ కంపెనీ ఏది.?
జ : REC Ltd. (రూరల్ ఎలక్ట్రిపీషియన్ కంపెనీ లిమిటెడ్)

9) కిసాన్ క్రెడిట్ కార్డులను డిజిటల్ విధానంలో అందిస్తున్న బ్యాంకు ఏది.?
జ : యూనీయన్ బ్యాంకు ఆఫ్ ఇండియా

10) అంబుజా, ఎసీసీ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కరణ్ అదాని

11) ICMR (indian council for medical research) డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : డా. రాజీవ్ బహల్

12) INS ( ఇండియన్ న్యూస్ పేపర్ సోసైటీ) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కే. రాజప్రసాద్ రెడ్డి (సాక్షి)

13) ఇటీవల డిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గా నియమితులయిన తెలుగు వ్యక్తి ఎవరు.?
జ : డా. ఎం. శ్రీనివాస్

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

14) ప్రపంచ ఆహార భద్రత కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ప్రకటించిన ఆర్ధిక సహాయం ఎంత.?
జ : 23,184 కోట్లు

15) ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు గబ్బిలాలు నుండి మానవులకు వ్యాపించే నూతన వైరస్ ను కనిపట్టారు. దాని పేరు ఏమిటి.?
జ : ఖోస్టా – 2

16) భారత్ – నేపాల్ మద్య ఇటీవల ఏ నది పై ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒప్పందం కుదిరింది.?
జ : సప్త కోశి నది. (సప్తకోశి హై డ్యాం ప్రాజెక్టు)

17) G-7 సభ్య దేశాలు ఏవి.?
జ : జపాన్, యూఎస్ఏ, ఇటలీ, కెనెడా, ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్ (JUICE – GF)

18) ఐరాస లో అత్యవసర మౌళిక మార్పులు కోసం ఇండియాతో కలిసి ఎన్ని దేశాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి.?
జ : 32 దేశాలు

19) G-4 సమావేశాలలో భారత్తరపున ఎవరు పాల్గొన్నారు.?
జ : డా. యస్. జైశంకర్

20) ఆస్ట్రేలియా – ఇండియా మద్య జరిగిన 3 టీట్వంటీ ల సిరీస్ ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : ఇండియా (2-1తేడాతో)

Follow Us @