12 ఆగస్టు 2022 కరెంట్ అఫైర్స్ Q.A

1) ఏ దేశం నుంచి ఆప్రికన్ చిరుతలను దిగుమతి చేసుకోవాలని భారత్ నిర్ణయం తీసుకుంది.?
జ : నమీబియా‌, దక్షిణాఫ్రికా

2) ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పెంపోందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : తొలిమెట్టు

3) ఎన్ని పోటోలతో కాకతీయుల కాలం నాటి చరిత్రను తెలిపే బుక్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది.?
జ : 777

4) ఇటీవల సింగపూర్ ప్రభుత్వం తమ దేశంలోని ఒఠ మైదానాన్ని 75వ స్వతంత్ర దినోత్సవ స్మారకంగా గుర్తించింది. ఆ మైదానం ప్రత్యేకత ఏమిటి.?
జ : 1943లో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ పౌజ్ ని స్థాపించి ఈ మైదానం నుంచి చలో డిల్లీ పిలుపునిచ్చారు.

5) సరళతర వ్యాపార నిర్వహణలో (EODB) లో ఎకానమిక్ టైమ్స్ పురష్కారం అందుకున్న రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

6) నేచర్ ఇండెక్స్ ర్యాంకింగులో తొలి స్థానంలో నిలిచిన సెంట్రల్ యూనివర్సిటీ ఏది.?
జ : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ

7) గుజరాత్ లోని పోర్డ్ ఇండియా ప్లాంట్ ని ఏ సంస్థ కొనుగోలు చేసింది.?
జ : టాటా మోటార్స్

8) మహిళల యూరో పుట్ బాల్ టోర్నీ విజేత ఎవరు.?
జ : ఇంగ్లండ్

9) అటల్ పెన్షన్ యోజన పథకానికి అక్టోబర్ 01, 2022 నుండి ఎవరిని కేంద్రం అనర్హులుగా ప్రకటించింది.?
జ : పన్ను చెల్లింపుదారులను

10) రాజకీయ పార్టీల ఉచిత హమీలపై సుప్రీం కోర్టు లో పిల్ దాఖలు చేసిన న్యాయవాది ఎవరు.?
జ : అశ్వినీ ఉపాద్యాయ

11) టీట్వంటీ క్రికెట్ లో 600 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ గా ఎవరు నిలిచారు.?
జ : డ్వెన్ బ్రావో

Follow Us @