TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th AUGUST 2022

TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th AUGUST 2022

1) ఏ నివేదిక ప్రకారం 2021లో 150 మిలియన్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు.?
జ : కేర్ సంస్థ నివేదిక

2) భారత దేశ ఎన్నికల సంఘం (EC) ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు.?
జ : రాజీవ్ కుమార్,

3) చెన్నైలోని మామల్లపురంలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన 44వ చెస్ ఒలింపియాడ్‌లో పథకాలు గెలిచిన జట్లు ఏవి.?
జ: ఉజ్బెకిస్థాన్ పురుషులు స్వర్ణం సాధించారు.( అర్మేనియా – రజత, భారత్ – కాంస్యం)

(మహిళల ఈవెంట్‌లో ఉక్రెయిన్ స్వర్ణం, జార్జియా – రజతం, భారత్ – కాంస్యం)

4) ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపంకుంటారు.?
జ : ఆగస్ట్ 10

5) 2022 ప్రపంచ జీవ ఇంధన దినోత్సవ థీమ్ ఏమిటి.?
జ : ‘సుస్థిరత మరియు గ్రామీణ ఆదాయం కోసం జీవ ఇంధనాలు’.

6) ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)లో చేరిన మొదటి పెద్ద టెక్ కంపెనీగా ఏది అవతరించింది.?
జ : మైక్రోసాఫ్ట్

7) 2026 చెస్ ఒలింపియాడ్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది.?
జ : ఉజ్బెకిస్తాన్

8) పాపువా న్యూ గినియా ప్రధానమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం ఎవరు చేశారు.?
జ : జేమ్స్ మరాపే

9) సినిమాల సహ-నిర్మాణాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో, భారతదేశం ఏ దేశంతో ‘ఆడియో విజువల్ కో-ప్రొడక్షన్ ట్రీటీ’పై సంతకం చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.?
జ : ఆస్ట్రేలియా

10) లంపి స్కిన్ డిసీజ్ నుండి పశువులను రక్షించేందుకు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఏ దేశీయ వ్యాక్సిన్ ను ప్రారంభించారు.?
జ : లంపి-ప్రోవాక్‌ను

11) ఏడవసారి AIFF పురుషుల ఫుట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సునీల్ ఛెత్రి

12) AIFF మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : మనీషా కళ్యాణ్

13) పురుషుల ఎమర్జింగ్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : విక్రమ్ ప్రతాప్ సింగ్

14) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించింది.?
జ : డిసెంబర్ 31, 2024 వరకు .

15) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) పథకం ఎప్పుడు ప్రారంభించబడింది.?
జ : 25 జూన్ 2015న

16) కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూలో 7వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక రాసిన ‘రస్టీ స్కైస్ & గోల్డెన్ విండ్స్’ పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ బాలిక పేరు ఏమిటి.?
జ : సానిధ్య శర్మ

17) జూలై 2022 కొరకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారు.?
జ : ప్రబాత్ జయసూర్య మరియు ఎమ్మా లాంబ్

Comments are closed.