09 ఆగస్ట్ 2022 కరెంట్ అఫైర్స్ Q.A.

1) అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు 7ను ఏ రోజు గా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : జాతీయ జావెలిన్ డే

2) భారత 75వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు హోదా పొందారు.?
జ : ప్రనవ్ (తమిళనాడు)

3) 2020 – 21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎంత విలువ చేసే రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసింది.?
జ : 1 83 ట్రిలియన్స్

4) కొలంబియా నూతన అధ్యక్షుడు గా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు.?
జ : గుస్తావో పెట్రో

5) లడఖ్ యొక్క అత్యున్నత పౌర గౌరవమైన ‘డిపాల్ ఆర్‌ంగమ్ డస్టన్’ అవార్డుతో ఎవరిని సత్కరించారు.?
జ : టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా

6) ఆర్మీ డిజైన్ బ్యూరో (ADB) భారత సైనికుల కోసం అధిక-ప్రభావ డ్రోన్‌లను అభివృద్ధి చేయడానికి ఎవరితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.?
జ : డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DFI)తో

7) ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 9న

8) 2022 ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవ థీమ్ ఏమిటి.?.
ద : “సాంప్రదాయ జ్ఞానం యొక్క సంరక్షణ మరియు ప్రసారంలో దేశీయ మహిళల పాత్ర.”

9) శ్రీలంకలో ఇంధన సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయం చేయడానికి 50 ఇంధన స్టేషన్లను తెరవనున్న సంస్థ ఏది.?
జ : ఇండియన్ ఆయిల్ కార్ప్ యూనిట్

10) ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపంకుంటారు.?
జ : ఆగస్టు 10

11) ప్రపంచ జీవ ఇంధన దినోత్సవ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022 ఆగస్టు 10న ఏ రాష్ట్రంలో నిర్మితమైన 2వ తరం (2G) ఇథనాల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నారు.?
జ : హర్యానాలోని పానిపట్‌లో

12) ఇండో-యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్‌సైజ్ “పూర్వ వజ్ర ప్రహార్ 2022” 13వ ఎడిషన్ ఆగస్టు 8న ఎక్కడ ప్రారంభమైంది.?
జ : హిమాచల్ ప్రదేశ్‌లోని బక్లోలోని స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్‌లో

13) 12వ డిఫెన్స్ ఎక్స్‌పో 2022 అక్టోబర్ 18, 2022 నుండి ఎక్కడ జరగనుంది.?
జ : గుజరాత్‌లోని గాంధీనగర్‌లో

14) చెన్నైలో ముగిసిన 44వ చెస్ ఒలింపియాడ్ లో భారత్ ఏ విభాగాలలో పథకాలు సాధించింది.?
జ : ఓపెన్ కేటగిరీలో – కాంస్యం
మహిళల కేటగిరీలో – కాంస్యం

Follow Us @