DAILY CURRENT AFFAIRS IN TELUGU 8th AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 8th AUGUST 2023

1) కేరళ రాష్ట్రానికి ఏమని పేరు మార్చడానికి అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది.?
జ : కేరళ

2) అంతు పట్టని లక్షణాలతో వ్యాపిస్తున్న ఏ వ్యాధి మీద కేంద్రం విచారణ చేపట్టనుంది.?
జ : హవానా సిండ్రోమ్

3) 16.7 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ అవశేషాలను భారత్ లో ఎక్కడ ఐఐటీ రూర్కీ, జీఎస్ఐ సంస్థలు కనుగొన్నాయి.?
జ : జైసల్మీర్ – రాజస్తాన్

4) తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల సంఖ్య ఎంత.?
జ : 13,003

5) ఏ గ్రహం యొక్క వేగం పెరిగిందని ఇటీవల నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.?
జ : అంగారకుడు

6) ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : ఏడవ స్థానం

7) ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు 2023లో భారత్ ఎన్ని పథకాలు సాదించింది.?
జ : 26 (G – 11, S – 5, B – 10)

8) ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు 2023లో మొదటి స్థానంలో వచ్చిన దేశాలు ఏవి.?
జ : చైనా (178), జపాన్ (93)

9) దేశంలో ప్రస్తుతం ఏన్ని అణు విద్యుత్ రియాక్టర్ లు ఉన్నాయి.?
జ : 22

10) తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : భూమన కరుణాకర్ రెడ్డి

11) భారతీయ రైల్వే 5G సేవల అభివృద్ధి కోసం ఏ ఐఐటితో ఒప్పందం చేసుకుంది.?
జ : ఐఐటీ మద్రాస్

12) ఆన్లైన్ గేమ్స్ కు కేంద్రం ఎంత జిఎస్టి అమలు చేస్తుంది.?
జ : 28%

13) హెల్త్ కేర్ విభాగంలో గ్లోబల్ లీడర్ అవార్డు 2023 ఎవరు ఎంపికయ్యారు.?
జ : జయోష్ సైని (లైఫ్ కేర్ గ్రూప్)

14) 2015 లో ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన లో ఇప్పటివరకు ఎంతమంది నమోదు చేసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 5.33 కోట్లు

15) HAL తయారు చేసిన రెండు డోర్నియర్ 228 ఎయిర్ క్రాప్ట్ లను ఏ దేశం కొనుగోలు చేసింది.?
జ : గయాన

16) మ్యాపింగ్ టిబేట్ పేరుతో ఎక్కడ 22 రకాల చారిత్రక టిబెట్ మ్యాపుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.?
జ : ధర్మశాల – హిమాచల్ ప్రదేశ్