1) SSLV – D1 ప్రయోగం ఎక్కడ నుండి ప్రయోగించబడినది.?
జ : షార్ (సూళ్లూరుపేట)
2) CSIR కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నల్లతంబి కలైసెల్వి
3) మిస్ ఇండియా – USA టైటిల్ ఎవరు గెలుచుకున్నారు.?
జ : ఆర్యా వల్వేకర్
4) నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్ని పెద్ద పులులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.?
జ : 73
5) చేనేత కార్మికులు మరణిస్తే 5 లక్షల భీమా అందించే పథకం (నేతన్న భీమా) ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది.?
జ : తెలంగాణ
6) అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫీడే ) ఉపాధ్యాక్షుడు గా ఎవరు నియమితులయ్యారు.?
జ : విశ్వనాథన్ ఆనంద్
7) 9వ రోజు కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పథకాలు సాదించిన క్రీడాకారులు ఎవరు.?
జ : నిఖత్ జరీన్, నీతూ ఘంఘాష్ , అమిత్ పంఘాల్, ఎల్డోస్ పాల్
8) ఘర్షణల నేపథ్యంలో ఏ రాష్ట్రంలో తాజాగా 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు.?
జ : మణిపూర్
9) ఆసియాలోనే ఎత్తైన గుడిని భారత్ లో ఎక్కడ నిర్మిస్తున్నారు.?
జ : హరియాణ లోని కురుక్షేత్ర లో జ్ఞాన్ మందిర్ పేరుతో
10) దేశంలో కొత్తగా ప్రారంభమైన విమానయాన సంస్థ పేరు ఏమిటి.?
జ : ఆకాశ ఎయిర్
11) హాకీ లో ఎన్ని సంవత్సరాల తర్వాత భారత్ పథకం సాదించింది.?
జ : 16 ఏళ్ల తర్వాత
12) భారత తయారీ తేజస్ యుద్ధ విమానాలు కొనుగోలు కు ఏ దేశం ఒప్పందం చేసుకుంది.?
జ : మలేషియా
13) సొంత ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న తొలి రాష్ట్రం ఏది.?
జ : కేరళ
14) హెపటైటిస్ – బి నివారణలో 2020 – 21 గాను ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్
15) ఐరాస లో భారత మొదటి శాశ్వత మహిళల ప్రతినిధి గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రుచిరా కాంబోజ్
16) జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 07
17)వన్డే లలో 8000 పరుగులు పూర్తి చేసిన మొదటి బంగ్లాదేశ్ ఆటగాడు ఎవరు.?
జ : తమీమ్ ఇక్బాల్
18) భారతదేశ మొట్టమొదటి డిజిటల్ లోక్ ఆధాలత్ లను ఏ రాష్ట్రాలు ఆగస్ట్ 13న నిర్వహిస్తున్నాయి.?
జ : మహారాష్ట్ర, రాజస్తాన్