TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st AUGUST 2022

TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st AUGUST 2022

1) మింజర్ మేళా 2022 ఏ రాష్ట్రంలో జరిగింది.?
జ : చంబా హిమాంచల్ ప్రదేశ్‌

2) ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ (DLSA)ని ఎక్కడ ప్రారంభించారు.?
జ : న్యూఢిల్లీ

3) వరల్డ్ రేంజర్ డే 2022 ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జూలై 31

4) T201 క్రికెట్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా ఎవరు నిలిచాడు.?
జ : ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్ మెక్‌కీన్

5) 18 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా ఎవరు నిలిచారు.?
జ : సావిత్రి జిందాల్

6) 2021-22లో భారతదేశంలోకి ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) పెట్టిన మొదటి 5 దేశాలు ఏవి.?
జ : సింగపూర్, US, మారిషస్, నెదర్లాండ్స్ మరియు స్విట్జర్లాండ్

7) పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి బంగారు నాణేలను విడుదల చేసిన దేశం ఏది.?
జ : జింబాబ్వే

8) జింబాబ్వే విడుదల చేసిన బంగారు నాణేలు పేరు ఏమిటి.?
జ : “మోసి-ఓ-తున్యా”( స్థానిక టోంగా భాషలో విక్టోరియా జలపాతాన్ని సూచిస్తుంది)

09) కామన్వెల్త్ గేమ్స్ 2022
వెయిట్ లిఫ్టింగ్‌లో 73 కిలోల కేటగిరీలో స్వర్ణ పథకం గెలుచుకుంది ఎవరు.?
జ : అచింత షెయులీ

10) కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ఆరు ప్రాజెక్టులకు మళ్లీ అనుమతి అవసరం లేదని కేంద్ర జల్‌ శక్తి శాఖ ఉత్తర్వులు జారీచేసింది అవి ఏవి.?
జ : ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు గంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల

11) చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం పేరు ఏమిటి.?
జ : తియాంగాంగ్

12) BSNL సేవలను మెరుగుపరచడానికి కేంద్రం ఎన్ని కోట్ల ప్యాకేజ్ ని కేటాయించింది.?
జ : 1.64 లక్షల కోట్లు

13) ఏ దేశంలోని భారత పెట్రోలియం రీసోర్స్ లిమిటెడ్ (BRCL) చమురు క్షేత్రంలో 12,800 కోట్ల పెట్టుబడులు కేంద్రం పెట్టనుంది.?
జ : బ్రెజిల్

14) డా. సి. నారాయణరెడ్డి సాహిత్య పురష్కారం 2022 ఎవరికి అందజేశారు.?
జ : అమ్మంగి వేణుగోపాల్

15) లింకన్ బుక్ ఆఫ్ రికార్డు లలో 500 మీటర్ల కాగితపు రోల్ పై ఖురాన్ ని రాసిన వ్యక్తి చోటు సంపాదించుకున్నాడు ఎవరు అతను.?
జ : ముస్తఫా ఇబన్ జమీల్ (జమ్మూ కశ్మీర్)

16) ఆహర భద్రతా 2021 – 22 లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థానం ఎంత.?
జ : తెలంగాణ – 15, ఆంధ్రప్రదేశ్ – 17

17) 5G స్పెక్టం వేలం ద్వారా ఎన్ని లక్షల కోట్లకు బిడ్లు వచ్చాయి.?
జ : 1.5 లక్షల కోట్లు

18) 5G స్పెక్టం వేలం ఎక్కువ స్పెక్ట్రమ్ దక్కించుకుంది ఎవరు.?
జ : రిలయన్స్ జియో

19) జూలై – 2022 నెలలో వసూలు అయినా జీఎస్టీ ఎంత.?
జ : 1.49 లక్షల కోట్లు

20) కామన్వెల్త్ గేమ్స్ 2022 జూడోలో పథకాలు సాదించిన భారత ఆటగాళ్లు ఎవరు.?
జ : సుశీల దేవి (రజతం)
విజయ్ కుమార్ యాదవ్
(కాంస్యం)