1) కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ కు మొదటి పథకాన్ని ఎవరు అందించారు.?
జ : సంకేత్ సర్గర్
2) కామన్వెల్త్ గేమ్స్ 2022లో సంకేత్ సర్గర్ ఏ విభాగంలో రజత పథకం సాదించారు.?
జ : పురుషుల 55 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో
3) కామన్వెల్త్ గేమ్స్ 2022లో వెయిట్‌లిఫ్టింగ్‌లో పురుషుల 61 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని ఎవరు కైవసం చేసుకున్నారాష్ట్ర.?
జ : గురురాజా పుజారి
4) కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ కు తొలి స్వర్ణ పథకాన్ని ఎవరు అందించారు.?
జ : మిరాబాయ్ చాను
5) కామన్వెల్త్ గేమ్స్ 2022లో మిరాబాయ్ చాను ఏ విభాగంలో స్వర్ణం సాదించారు.?
జ : 49 కేజీల వెయిట్ లిప్టింగ్
6) ఆయుష్ బిల్డింగ్ కాంప్లెక్స్‌ను కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఎక్కడ ప్రారంభించారు.?
జ : మహారాష్ట్రలోని నవీ ముంబైలో
7) నరేంద్ర సింగ్ తోమర్ ఎన్నో వ్యవసాయ గణనను తాజాగా ప్రారంభించారు.?
జ : 11వ
8) భారతదేశంలోని మొట్టమొదటి టీచింగ్ రోబో ‘ఈగిల్’ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని ఏ స్కూల్ ద్వారా పరిచయం చేయబడింది.?
జ : ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్
9) 2024 పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు తమ అధికారిక నినాదంగా దేనిని ప్రకటించారు.?
జ : “గేమ్స్ వైడ్ ఓపెన్”
10) ఫార్ములా వన్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ ఆటగాడు ఎవరు.?
జ : సెబాస్టియన్ వెటెల్
11) కరోనా అన్ని రకాల వేరియంట్స్ పై పని చేయడానికి కైమెరిక్ స్పైక్ యాంటిజెన్స్ ను ఏ సంస్థ కనుగొన్నది.?
జ : ఎక్సెల్ జీన్ ఎన్ఏ (స్విస్)
12) ప్రపంచ మలేరియా నివేదిక ప్రకారం 2020 లో మలేరియా కారణంగా ఎంతమంది చనిపోయారు.?
జ : 6.27 లక్షల మంది
13) మలేరియా వ్యాప్తికి కారణం అవుతున్న ఏ జన్యువును హెచ్.సీ.యూ వర్శిటీ శాస్ర్తవేత్త లం కనుగొన్నారు.?
జ : SIMP
14) అమెరికా తొలిసారిగా (1952 జూలై 23) ప్రయోగించిన ఏ శాటిలైట్ లకు 50 ఏళ్ళు పూర్తి అయ్యాయి.?
జ : ల్యాండ్ శాట్
15) డ్రైవర్ లేకుండా నడిచే ఎలక్ట్రిక్ కారు అపోలో RT6 ను ఏ దేశ సంస్థ ఆవిష్కరించింది.?
జ : చైనా (బైదూ)
16) పశ్చిమ బెంగాల్ లో ఒక్క రూపాయి డాక్టర్ గా పేరోందిన పద్మశ్రీ గ్రహీత, గిన్నిస్ రికార్డు హోల్డర్ ఇటీవల మరణించారు ఆరన పేరు ఏమిటి.?
జ : సుషోవన్ బందోపాధ్యాయ్
17) ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం తీసుకొచ్చిన యాప్ పేరు ఏమిటి.? జ : గరుడ
18) లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2022 కు ఎవరు ఎంపికయ్యారు.? జ : టెస్సీ థామస్
19) జియో సైన్స్ & టెక్నాలజీ జాతీయ అవార్డు ఎవరు ఎంపికయ్యారు.? జ : డా. వి.యం. తివారీ
20) రామగుండం లో ఎన్టీపీసీ నిర్మించిన ఎన్ని మెగా వాట్ల తెలియాడే సోలార్ ప్లాంట్ ని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.? జ .: 100 మెగా వాట్లు
Follow Us @