1) దేశీయంగా తయారైన మొట్టమొదటి ఏ యుద్ధ విమాన వాహక నౌకను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ జూలై 28న నేవీకి అందజేసింది. ?
జ : ‘విక్రాంత్’
2) 13 ఏళ్ల వయసులోనే హిమాలయాల్లోని ఎత్తయిన పర్వతాలుగా పేరుగాంచిన కాంగ్‌యాత్సే, డోజో జోంగోలను తక్కువ సమయంలో అధిరోహించి రికార్డు సృష్టించినది ఎవరు.?
జ : కార్తికేయ
3) ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది.?
జ : జూలై 28న
4) హెపటైటిస్ దినోత్సవం 2022 థీమ్ ఏమిటి.?
జ : హెపటైటిస్ సంరక్షణను మీకు చేరువ చేయడం.
5) అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జూలై 29న
6) అంతర్జాతీయ పులుల దినోత్సవం 2022 థీమ్ ఏమిటి.?
జ : పులి జనాభాను పునరుద్ధరించడానికి భారతదేశం ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది
7)ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జూలై 28న
8) ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం 2022 థీమ్ ఏమిటి.
జ : ప్రకృతితో సామరస్యంగా జీవించడం’.
9) తాజా పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఎన్నో స్థానాన్ని నిలబెట్టుకుంది.
జ : 3వ స్థానం( 1వ స్థానం: న్యూజిలాండ్, 2వ స్థానం: ఇంగ్లండ్,
4వ స్థానం: పాకిస్థాన్)
10) ఇంగ్లండ్‌లోని ఏ క్రికెట్ గ్రౌండ్‌కు భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేరు పెట్టారు.?
జ : లీసెస్టర్ క్రికెట్ గ్రౌండ్
11) తాజాగా కన్నుమూసిన నోబెల్ శాంతి బహుమతి విజేత ఉత్తర ఐరిష్ మాజీ మొదటి మంత్రి ఎవరు.?
జ : డేవిడ్ ట్రింబుల్
12) సెమీకండక్టర్ విధానాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది.?
జ : గుజరాత్
13) భారతదేశపు మొట్టమొదటి బులియన్ ఎక్స్చేంజ్ ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : GIFT సిటీ, గాంధీనర్ (గుజరాత్)లో
14) భారత నావికాదళం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యునైటెడ్ స్టేట్స్ నుండి అందుకున్న యుద్ధ హెలికాప్టర్ లు ఏవి.?
జ : MH 60R మల్టీ-రోల్ హెలికాప్టర్లు