18 జూలై 2022 కరెంట్ అఫైర్స్ 2022 Q.A.

1) జూలై 17న భారత్, చైనాల మధ్య 16వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఎక్కడ జరిగాయి.?
జ : భారత్ వైపున ఉన్న చుషుల్-మోల్డో సరిహద్దు సమావేశ పాయింట్‌లో

2)న్యూ ఢిల్లీలో నేవల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ (NIIO) సెమినార్ ‘స్వావలంబన్’ సందర్భంగా భారత నావికాదళంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి ఊతం ఇవ్వడానికి ఉద్దేశించిన ఏ పరిజ్ఞానాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.?
జ : ‘SPRINT ఛాలెంజెస్’ను

3) భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరంలో, భారత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” జరుపుకుంటుంది. దీనిలో బాగంగా ఏ కార్యక్రమం జరిపారు.?
జ : “ఉద్యమిత పఖ్వారా”

4) ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్ గెలిచిన ఎన్నవ భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.?
జ : 3వ భారత కెప్టెన్‌గా

5) ఇంతకుముందు ఇంగ్లండ్‌లో భారత్‌ను వన్డే సిరీస్‌ను గెలిపించిన
ఇద్దరు భారత కెప్టెన్లు ఎవరు.?
జ : ఎంఎస్ ధోని మరియు మహ్మద్ అజారుద్దీన్

6) షాంఘై సహకార సంస్థ మొదటి “సాంస్కృతిక మరియు పర్యాటక రాజధాని”గా ఏ భారత నగరాన్ని గుర్తించింది.?
జ : వారణాసి

7)వినియోగదారుల వ్యవహారాల శాఖ తన కొత్త మస్కట్ ని ప్రారంభించింది. దాని పేరు ఏమిటి.?
జ : “జాగృతి”

8) నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం 2022 జూలై 18న నిర్వహించబడింది దాని 2022 థీమ్ ఏమిటి.?
జ : “Do what you can, with what you have, where you are”.

9) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టం ప్రకారం వారంలో ఎన్ని పని దినాలు ఉండనున్నాయి.?
జ : 4

10) 2022 – 23 ఆర్దిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును మోర్గాన్ స్టాన్లీ ఎంతగా నిర్ణయించింది.?
జ : 7.2%

11) అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ క్రికెటర్ ఎవరు.?
జ : బెన్ స్టోక్స్

12) ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2022 లో మహిళల 100 మీటర్ల రన్నింగ్ లో స్వర్ణ పథక విజేత ఎవరు.?
జ : షెల్లీ ఆన్ ప్రెజర్ ప్రైస్

13) ప్రపంచ కప్ షూటింగ్ లో స్కిట్ విభాగంలో స్వర్ణం నెగ్గిన భారతీయ క్రీడాకారుడు ఎవరు.?
జ : మేరాజ్ ఆహ్మద్ ఖాన్

Follow Us @