14 జూలై 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1). భారతదేశంలో TBని నిర్మూలించే లక్ష్యంతో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏ శాఖతో ఒప్పందంపై సంతకం చేసింది?
జ – పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ

2). పార్లమెంటు కొత్త భవనం కోసం 6.5 మీటర్ల ఎత్తైన అశోక స్తంభాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు?
జ – నరేంద్ర మోదీ

3). జూలై 2022లో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ – R.K. గుప్తా

4). జాతీయ చేపల రైతు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు?
జ – జూలై 10

5). ఇటీవల సీ గార్డియన్-2 నావికా విన్యాసాలు చైనా ఏ దేశంతో కలిసి చేసింది.?
జ – పాకిస్తాన్

6). భారతదేశంలోని మొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే ఏది?
జ – ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే

7). ఇటీవల చర్చలో ఉన్న ‘INS విక్రాంత్’ అంటే ఏమిటి?
జ – ఒక విమాన వాహక నౌక

8). ఇటీవల విక్టోరియా బొలీవియానా అనే పదం చర్చనీయాంశమైంది. ఇది ఎవరికి సంబంధించినది?
జ – నీటి కలువ జాతి

9). ఏ దేశానికి గ్యాస్ సరఫరా కోసం, ఇటీవల చర్చలో ఉన్న ‘నార్డ్ స్ట్రీమ్ 1 అండర్ వాటర్ గ్యాస్ పైప్‌లైన్’ రష్యా ప్రారంభించనుంది.?
జ – జర్మనీ

10). ఇటీవల ‘అజర్స్ హై’ అనే పదం హెడ్‌లైన్స్‌లో ఉంది, దాని అర్థం ఏమిటి?
జ – ఉప ఉష్ణమండల వాతావరణ దృగ్విషయం

11). ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్’కి సంబంధించిన దేశం ఏది?
జ – ఇరాన్

12). ప్రపంచ మలాలా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
జ – జూలై 12

13). ఫిన్‌లాండ్‌లో ఇటీవల 100 మీటర్ల స్ప్రింట్‌లో 94 ఏళ్ల భగవానీ దేవి ఏ పతకాన్ని గెలుచుకుంది?
జ – బంగారు పతకం

14). డియోఘర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జ – జార్ఖండ్

15) శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్సే ఏ దేశానికి పారిపోయాడు.?
జ : సింగపూర్

16) బ్రిటన్ ప్రధానమంత్రి పోటీలో ముందున్న ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : రిషి సునక్

17) వ్యక్తిగత శ్రద్ధతో డాక్టర్లు వైద్య సేవలందించేలా భారీ కార్యక్రమానికి ఏ రాష్ట్రం కార్యక్రమం ప్రారంభించనుంది.?
జ : ఆంధ్రప్రదేశ్

18) తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : మేడే రాజీవ్‌ సాగర్‌

19) ప్రపంచ కప్ మహిళల హకీలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 9వ స్థానం

20) దక్షిమ కొరియాలోని చాంగ్వాన్‌ జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌లో భారత్‌ తరపున స్వర్ణం, కాంస్య పథకాలు గెలిచిన జోడీలు ఎవరు.?
జ : 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మెహులి ఘోష్‌–షాహు తుషార్‌ మనే జోడికి స్వర్ణం.
10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో పాలక్‌–శివ నర్వాల్‌ కాంస్య పతకం
.

21) డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) ఏ మొబైల్ తయారీ సంస్థకు షోకాజ్‌ నోటీసులు (ఎస్‌సీఎన్‌) జారీ చేసింది?
జ : ఒప్పో

22) ఇన్పోసిస్ ఏ యూరప్ సంస్థను 875 కోట్లకు కోనుగోలు చేసింది.?
జ : బేస్ (BASE) లైఫ్ సైన్సెస్

23) గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం నాస్కామ్‌ ఫౌండేషన్, టెక్నాలజీ దిగ్గజం గూగుల్, స్వచ్ఛంద సంస్థ ఐఎస్‌ఏపీ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ పేరు.?
జ : డిజివాణి కాల్‌సెంటర్‌

24) గాలిలో ఎగిరే మానవరహిత విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు తదితరాల (యూఏవీ) సాంకేతికత అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థను ప్రారంభించనుంది.?
జ : టీ వర్క్స్

25) భారతదేశం మొదటిసారి ఏ దేశం నుంచి సిమెంట్ దిగుమతి చేసుకుంటుంది.?
: నేపాల్

26) గుజరాత్ లోని ఒక వ్యక్తి కి ప్రపంచంలోనే 10వ, భారత్ లో మొదటిసారి ప్రత్యేక బ్లడ్ గ్రూప్ ని కనుగొన్నారు.? ఆ బ్లడ్ గ్రూప్ పేరు ఏమిటి.?
జ : EMM NEGATIVE BLOOD GROUP

27) భారతదేశం లో మొట్టమొదటి “ఈ వేస్ట్ ఇకో పార్క్” ని ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు.?
జ : డిల్లీ

28) భారతదేశంలో నిరుద్యోగిత రేటు జూన్ లో గరిష్టంగా ఎంత శాతానికి చేరింది.?
జ : 7.80%

29) చంద్రుడి పై ఉండే వాతావరణం లో గడిపిన తెలుగు అమ్మాయి పేరు ఏమిటి.?
జ : జహ్నవి దంగేటి

30) చంద్రుడి పై ఉండఘ వాతావరణం ఉండే అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్‌ ఎక్కడ ఉంది.?
జ : పోలండ్‌

31) జూలై 13 న ఆకాశంలో కనిపించిన సూపర్ మూన్ కి ఏమని పేరు.?
జ : బక్ మూన్