జూలై 11, 2022 కరెంట్ అఫైర్స్ Q.A.

1) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దీని ప్రత్యేకతలు ఏమిటి.?
జ : జాతీయ చిహ్నం మొత్తం 9,500 కిలోల బరువు మరియు 6.5 మీటర్ల ఎత్తుతో కాంస్యంతో రూపొందించబడింది.

2) కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సురక్షితమైన & సుస్థిర అంతరిక్ష పర్యావరణం కోసం ప్రారంభించిన ప్రాజెక్టు పేరు ఏమిటి.?
జ : ISRO సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (IS4OM)

3) నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాజేంద్ర ప్రసాద్

4) ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2022ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : చార్లెస్ లెక్లెర్క్

5) ప్రపంచ జనాభా దినోత్సవం 2022 జూలై 11న నిర్వహించబడుతుంది. దీని థీమ్ ఏమిటి.?
జ : A world of 8 billion: Towards a resilient future for all – Harnessing opportunities and ensuring rights and choices for all.”

6) ఎక్కడ మొట్టమొదటి గ్యాస్ ఆధారిత టీ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు.?
జ : త్రిపుర లోని దుర్గాబరి రాష్ట్రంలో

7) వరల్డ్ ఎకానామిక్ ఫోరం(WEF) ప్రపంచ లింగ అసమానత్వ సూచిక – 2021 లో 156 దేశాలలో భారత స్థానం ఎంత.?
జ : 140

8) వరల్డ్ ఎకానామిక్ ఫోరం(WEF) ప్రపంచ లింగ అసమానత్వ సూచిక – 2021 లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : ఐస్ ల్యాండ్

9) వరల్డ్ ఎకానామిక్ ఫోరం(WEF) ప్రపంచ లింగ అసమానత్వ సూచిక – 2021 ప్రకారం లింగ సమానత్వం కోసం ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టనుంది.?
జ : 135.6 సంవత్సరాలు

10) ప్రపంచ జనాభా ఎప్పటికీ 800 కోట్లకు చేరనుంది.?
జ : 2022 నవంబర్ – 15 నాటికి

11) ఇంటర్నేషన్‌ టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌, ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ లు 2021 గోల్డెన్‌ అచీవ్‌మెంట్‌ అవార్డను ఎవరికి అందజేశాయి.
జ : విజయ్ అమృతరాజ్

12) ఫిన్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ టోర్నీలో 94 ఏళ్ల భారత్ క్రీడాకారిణి ఒక స్వర్ణం, రెండు కాంస్య పథకాలు సాదించింది. ఆమె పేరు ఏమిటి.?
జ : భగవాణి దేవి

13) ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో స్వర్ణం నెగ్గిన భారత యువ షూటర్‌ ఎవరు.?
జ : అర్జున్‌ బబుతా

14) భారత రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే ఆల్ టైం కనిష్ఠానికి ఎంతకు పడిపోయింది.?
జ :79.45

15) ఏ భారీ టెలిస్కోప్ తీసిన చిత్రాలను జోబైడెన్ విడుదల చేసారు.
జ : జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌

Follow Us @