DAILY CURRENT AFFAIRS IN TELUGU 30th JUNE 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 30th JUNE 2022

1) ఇటీవల జార్ఖండ్ మరియు ఆంధ్రప్రదేశ్ తర్వాత యురేనియం తవ్వకంలో ప్రవేశించిన మూడవ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది?
జ – రాజస్థాన్

2) భారతదేశం యొక్క ‘రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్’ కోసం ప్రపంచ బ్యాంక్ ఇటీవల ఎన్ని మిలియన్ల రుణాన్ని ఆమోదించింది?
జ – 250 మిలియన్లు

3) నాలుగు రోజుల అంబుబాచి మేళా ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది?
జ – అస్సాం

4) మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2022 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
జ – ఖుషీ పటేల్

5) సావో జోవో పండుగను ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు?
జ – గోవా

6) ఇటీవల ఏ దేశం ఘన ఇంధన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపింది?
జ – ఇరాన్

7) జాతీయ గణాంక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
జ – జూన్ 29

8) జూన్ 2022లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT)కి కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ – నితిన్ గుప్తా

9) తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా బృందాల) తయారు చేసే ఉత్పత్తులను అమ్మడానికి ఏ సంస్థతో ఒప్పందం చేసుకున్నాయి.?
జ – ప్లిప్ కార్ట్

10) తాజాగా నాటో దేశాల వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది.?
జ – స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో

11) నాటో(నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గజేషన్‌) కూటమిలో సభ్యు దేశాలు ఎన్ని.?
జ – 30

12) నాటో ప్రధాన కార్యదర్శి ఎవరు.?
జ – జెన్స్‌ స్టోటెన్‌బెర్గ్‌

13) యూరప్ ప్రాంత భద్రతా కోసం అమెరికా ఏ దేశంలో శాశ్వత మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.?
జ – పోలెండ్

14) నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది.?
జ – చండీగఢ్ లో

15) PSLV C53 ద్వారా ఏ దేశపు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ISRO పంపింది.?
జ – సింగపూర్

16) సింగపూర్ కి చెందిన ఏ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది.?
జ – డీఎస్‌–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్‌–1 ఉపగ్రహాం.

17) ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లోని బిజినెస్‌ రీఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020లో అగ్రస్థానం లో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ – ఆంధ్రప్రదేశ్

18) మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : ఎకనాథ్ షిండే

19) మెస‌ర్స్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ స‌ర్వే నివేదిక ప్రకారం భారత్ లో జీవన వ్యయం అధికంగా ఉన్న నగరం ఏది.?
జ – ముంబై

20) ఇంగ్లండ్ తో జరగనున్న 5వ టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ గా ఎవరు నిరమితులయ్యారు.?
జ – జస్ప్రీత్ బుమ్రా (1987 తర్వాత ఒక పాస్ట్ బౌలర్)

21) తాజాగా డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అత్యవసర వినియోగ అనుమతి కింద జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ కు చెందిన కరోనా వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. ఆ వ్యాక్సిన్ పేరు ఏమిటి.?
జ – జెమ్‌కోవాక్‌-19

22) రష్యా తాజాగా తమ బలగాలను స్నేక్ ఐలాండ్ నుండి ఉపసంహరించుకున్నాయి. ఈ స్నేక్ ఐలాండ్ ఏ సమద్రంలో ఉంది.?
జ : నల్ల సముద్రం

23) పారెక్స్ ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ చరిత్రలోనే తొలిసారిగా ఎంత కనిష్ఠానికి పడిపోయింది.?
జ : 79.05 రూపాయలు