1) ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
సమాధానం – జూన్ 20
2) రెన్యూవబుల్స్ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2022 ప్రకారం, 2021 సంవత్సరంలో పునరుత్పాదక ఇంధన వ్యవస్థాపనలలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి?
సమాధానం – మూడవది
- ఇటీవల ఏ దేశం ఫుజియాన్ విమాన వాహక నౌకను ప్రారంభించింది?
సమాధానం – చైనా
4) 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 థీమ్ ఏమిటి?
సమాధానం – మానవత్వం కోసం యోగా
5) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
సమాధానం – జూన్ 21
6) 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 ఎక్కడ నిర్వహించబడింది?
సమాధానం – మైసూర్, కర్ణాటక
7) ఇటీవల ఏ దేశంలో ‘మహిళల శాంతి భద్రతల సదస్సు’ నిర్వహించబడింది?
సమాధానం – మంగోలియా
8) ‘ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన’ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
సమాధానం – గుజరాత్
9) 1000 మందికి పైగా మరణానికి కారణమైన భూకంపం తాజాగా ఏ దేశంలో సంభవించింది.?
జ : అఫ్ఘనిస్తాన్
10) జీశాట్ 24 ఉపగ్రహం ను ఏ అంతరిక్ష కేంద్రం నుండి లాంచ్ చేశారు.?
జ : ప్రాన్స్ లోని ప్రెంచ్ గయానా
11) జీశాట్ 24 ను రూపొందించిన చేసిన సంస్థలు ఏవి.?
జ.: న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ & డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్
12) పూర్తిగా జల, సౌర విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకుంటున్న తొలి భారతీయ విమానాశ్రయం ఏది.?
జ : ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (డిల్లీ)
13) అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) మహిళల ప్రొ లీగ్‌లో కాంస్య పథకం దక్కించుకున్న జట్టు ఏది.?
జ : భారత్
14) సౌదీ అరేబియా ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ప్రైజ్’కు ఎంపికైన భారతీయుడు ఎవరు.?
జ : టి.ప్రదీప్
15) ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ.: జస్టీస్ రంజన దేశాయ్
16) మహిళల కోసం గూగుల్ ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి.?
జ : అంకుర
17) ఏ పథకం కింద భారతదేశం లో తొలి ప్రైవేట్ రైల్ పట్టాలెక్కింది.?
జ : భారత్ గౌరవ్
18) తమ క్రీడాకారులను ఆసియా క్రీడలకు పంపడానికి నిరాకరించిన దేశం?
జ : ఆస్ట్రేలియా