1) ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
సమాధానం – హర్యానా
2) ఆపరేషన్ మహిళా సురక్ష దేనికి సంబంధించినది?
సమాధానం – రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
3) @3.0లో యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది?
సమాధానం – లక్నో
4) ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
సమాధానం – జెనీవా
5) భారత ఫెడరలిజాన్ని “సహకార సమాఖ్యవాదం”గా అభివర్ణించింది ఎవరు?
సమాధానం – గ్రాన్విల్లే ఆస్టిన్
6) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల “ACB 14400” పేరుతో యాప్‌ను ప్రారంభించింది?
సమాధానం – ఆంధ్రప్రదేశ్
7) ఇటీవల ఏ దేశ పరిశోధకులు ప్రపంచంలోనే అతి పెద్ద మొక్కను కనుగొన్నారు?
సమాధానం – ఆస్ట్రేలియా
8) ఏ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం “ఆంచల్” అనే ప్రత్యేక సంరక్షణ ప్రచారాన్ని ప్రారంభించింది?
సమాధానం – రాజస్థాన్
9) ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించి రికార్డు సృష్టించిన తెలంగాణకు చెందిన బాలిక ఎవరు.?
జ : మాలవత్ పూర్ణ
10) వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై మద్దతు ధరలను కేంద్రం ఎంతకు పెంచింది.?
రూ.100 పెంచారు. (సాధారణ రకం క్వింటాల్ రూ.1,940 ఉండగా తాజా నిర్ణయంతో రూ. 2,040కు పెరగనుంది. గ్రేడ్–ఏ రకం రూ.1,960 నుంచి రూ.2,060కు పెరగనుంది.)
11) ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్‌ఫోర్స్‌లలో.. భారత వైమానిక దళానికి ఎన్నో స్థానం దక్కింది.?
జ : 6వ స్థానం
12) మింట్ మ్యూజియం ను ఎక్కడ ఏర్పాటు చేశారు.
జ : హైదరాబాద్
13) భారత దేశ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు ను ప్రపంచం బ్యాంకు ఎంతగా నిర్ణయించింది.?
జ : 7.5%
14) చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం పేరు ఏమిటి.?
జ : తియాంగాంగ్