మే 11, 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) ఆసియా కప్‌ అర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన జోడీ.?
జ : 1) పర్నీత్‌ కౌర్, అదితి స్వామి, సాక్షి చౌదరీ
2) ప్రథమేశ్‌ ఫుగె, రిషభ్‌ యాదవ్, జవకర్‌ సమాధాన్‌
3) ప్రథమేశ్‌ ఫుగె, పర్నీత్‌ కౌర్‌

Q2) ఫిలిప్పీన్స్‌ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
జ : మార్కోస్‌ జూనియర్‌

Q3) పులిట్జర్‌ అవార్డుకు ఎంపికైన భారతీయ ఫోటో జర్నలిస్టు?
జ : డానిష్‌ సిద్దిఖికి మరియు అద్నాన్‌ అబిది, సనా ఇర్షాద్‌ మట్టో, అమిత్‌ దేవ్‌

Q4) 20వ శతాబ్దంలో అత్యధిక ధర పలికిన పెయింటింగ్‌?
జ : ఆండీ వర్హోల్‌ పట్టు వస్త్రంపై వేసిన హాలీవుడ్‌ నటి మార్లిన్‌ మన్రో పెయింటింగ్‌

Q5) మార్లిన్‌ మన్రో పెయింటింగ్‌ ఎంత ధరకు అమ్ముడుపోయింది.?
జ : 1506 కోట్లు

Q6) అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం(ఇస్టా) అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : తెలంగాణ విత్తనా భివృద్ధి సంస్థ ఎండీ ప్రొఫెసర్‌ కేశవులు

Q7) ఇటీవల ఏ రాష్ట్రంలో 2,985 అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు?
జ : అస్సాం

Q8) ఇన్సులిన్‌ ను విడుదల చేసేలా క్లోమాన్ని ప్రేరేపించే పదార్థాన్ని తాజాగా ఎవరు గుర్తించారు.? ఆ పదార్థానికి ఏమని పేరు పెట్టారు.?
జ : హిమచల్ ప్రదేశ్ మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు. (పదార్థం పీకే2).

Q9) చంద్రుడిపై నీటికి భూమే ఆధారం అని ప్రకటించిన శాస్త్రవేత్తలు.?
జ : అలస్కా శాస్త్రవేత్తలు

Q10) ఏ దేశంలో జరగాల్సిన 19వ ఆసియా క్రీడలు – 2022 వాయిదా పడ్డాయి.?
జ : చైనాలోని హాంగ్‌జౌలో

Q11) ఆసియా ఎన్నికల సంస్థల సంఘం అధ్యక్ష పదవి ఏ దేశానికి దక్కింది.?
జ : భారతదేశం

Q12) ఐరాస మానవ హక్కుల మండలి లో రష్యా బదులు చోటు దక్కించుకున్న దేశం ఏది.?
జ : చెక్ రిపబ్లిక్

Q13) దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : యూన్ సూక్ యూల్

Q14) ఏ చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది.?
జ : రాజద్రోహ చట్టం

Q15) ప్రజలు తమ వ్యక్తిగత ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన యాప్ పేరు ఏమిటి.?
జ : తెలంగాణ డయోగ్నాస్టిక్స్

Q16) ఐడీబీఐ చైర్మన్ గా ఎవరు నిరమితులయ్యారు.?
జ : టీఎన్ మనోహరన్

Follow Us @