DAILY CURRENT AFFAIRS IN TELUGU 31st AUGUST 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 31st AUGUST 2023

1) 2023 – 24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదయింది.?
జ : 7.8%

2) అక్రమ సిమ్ కార్డులు కలిగి ఉంటే ఎంత జరిమానా విధించనునట్లు డాట్ సంస్థ ప్రకటించింది.?
జ : 10 లక్షలు

3) జపాన్ శాస్త్రవేత్తలు నూతన ఆక్సిజన్ ఐసోటోపును గుర్తించారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : ఆక్సిజన్ – 28

4) 2023 కు గాను రామన్ మెగాసేసే అవార్డు కు ఎంపికైన భారత డాక్టర్ ఎవరు.?
జ : రవి కన్నన్

5) లక్ష కోట్ల మార్కెట్ విలువ కలిగిన మొట్టమొదటి భారతీయ విమానయాన సంస్థగా ఏ సంస్థ రికార్డు సృష్టించింది.?
జ : ఇండిగో

6) బ్రిటన్ ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రవాస భారతీయ మహిళ ఎవరు.?
జ : క్లెయిర్ కౌటినో

7) అమెరికాలోని ఏ రాష్ట్రం అక్టోబర్ నెలను హిందూ వారసత్వం నెలగా ప్రకటించింది.?
జ : జార్జియా

8) భూమికి 42.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటో ఆవరణము నుండి నేరుగా కిందికి దూకనున్న తొలి మహిళగా ఎవరు రికార్డు సృష్టించనున్నారు.?
జ : స్వాతి వర్ష్‌నే

9) 2023 కు గాను రామన్ మెగాసేసే అవార్డు కు ఎంపికైనవారు ఎవరు.?
జ : రవి కన్నన్, మిరియం కరోనల్ ఫెర్రర్,యూజెనియో లెమోస్, కోర్వీ రక్షందల

10) భారతదేశంలో బీసీసీఐ నిర్వహించే అంతర్జాతీయ మ్యాచ్ ల ప్రసార హక్కులను వచ్చే ఐదు సంవత్సరాలకు 6,009 కోట్లకు ఏ సంస్థ దక్కించుకుంది.?
జ : వయాకామ్ 18

10) భారత డైనమిక్స్ లిమిటెడ్ (BDL) సంస్థ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : పీవీ రాజరామ్

11) వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్న తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎవరు.?
జ: శాంతా తౌటం

12) భారత్ లో జెట్ ఇంజన్ల తయారీ కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఆమెరికా కు చెందిన ఏ సంస్థ తో ఒప్పందం చేసుకుంది.?
జ : జీఈ ఏరోస్పేస్

13) ఇండియన్ ఆయిల్ కార్ఫోరేషన్ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమింకుంది.?
జ : చెఫ్ – సంజయ్ కపూర్

14) FIFA ఏ దేశం పై నిషేధం ఎత్తివేసింది.?
జ : శ్రీలంక

15) అనాధ పిల్లలకు ఉచిత ఆహారం , విద్య అందించడానికి ‘నో బెగ్గింగ్” కార్యక్రమం కింద ఏ నగరాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు.?
జ : నోయిడా

16) ఏ మరియు బి గ్రూప్ ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులలో ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : హర్యానా