DAILY CURRENT AFFAIRS IN TELUGU 30th APRIL 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 30th APRIL 2023

1) ఏ దేశానికి భారత్ రక్షణ అవసరాల నిమిత్తం గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాప్ట్ ను బహుకరించనుంది.?
జ : మాల్దీవులు

2) రోమ్ ఏటీపీ చాలెంజర్టెన్నిస్ టోర్నీ విజేతగా నిలిచిన భారతీయుడు ఎవరు.?
జ : సుమీత్ నగాల్

3) ప్రపంచ చెస్ ఛాంపియన్సిఫ్ – 2023 విజేత గా ఎవరు నిలిచారు.?
జ : లిరెన్ డింగ్ (చైనా)

4) ప్రపంచ చెస్ ఛాంపియన్సిఫ్ – 2023 రన్నర్ గా ఎవరు నిలిచారు.?
జ : నెఫోమ్నిసి

5) స్మార్ట్ ఫోన్ల అమ్మకాలలో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది.?
జ : శాంసంగ్

6) ఐపీఎల్ లో 1000వ మ్యాచ్ లో సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు.?
జ : యశస్వీ జైశ్వాల్

7) ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నీ 2023 లో పురుషుల డబుల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : సాత్విక్ – చిరాగ్‌శెట్టి జోడి

8) ఆకలిని పెంచేఏ హర్మోన్ ను విడుదల చేసే ఔషదాన్ని ఇటీవల న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
జ : గ్రెలిన్ హర్మోన్

9) ఇటీవల భారత్ లో పర్యటించిన ఇజ్రాయెల్ స్పీకర్ ఎవరు.?
జ : అమిర్ ఒహనా

10) సమాచార హక్కు చట్ట ప్రకారం రైల్వే శాఖ వందే భారత రైళ్ల సరాసరి వేగాన్ని ఎంతగా వెల్లడించింది.?
జ : గంటకు 83 కీ.మీ. వేగం

11) నాసా యొక్క ఏ నౌక 50 కి పైగా అంతరిక్ష ప్రయాణాలు చేసి రికార్డు సృష్టించింది.?
జ : ఇంజెన్యూటీ మార్స్ హెలికాప్టర్

12) మే 24న GSLV -F12 రాకెట్ ద్వారా ఇండియన్ నావిగేషన్ సిస్టం అభివృద్ధి కోసం ప్రయోగించనున్న శాటిలైట్ పేరు ఏమిటి.?
జ : నావిక్ – 1 (IRNSS -1J)

13) అజర్ బైజాన్ గ్రాండ్ ఫ్రీ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : సెర్జియో పెరేజ్

14) షాట్‌గన్ షూటింగ్ ప్రపంచ కప్ స్కిట్ ఈవెంట్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన భారత్ జోడి ఏది.?
జ : మేరాజ్ ఆహ్మద్ ఖాన్ – గనీమత్ సెఖో